Y.V.S. Chowdhary Wife : వై.వీ.ఎస్. భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిసా…?

Y.V.S. Chowdhary Wife : ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన నాగార్జునతో కలిసి చేసిన నిన్నే పెళ్లాడతా సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలోనే డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర వైవిఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు.. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత కృష్ణవంశీ చేసిన సింధూరం సినిమాకి కూడా వైవిఎస్ చౌదరి.. కృష్ణవంశీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలుకువలు నేర్చుకొని.. ఆ తర్వాత వెంకట్ ని హీరోగా పెట్టి ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ అనే సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఏకంగా నాగార్జున తోనే ‘సీతారామరాజు’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు వైవిఎస్ చౌదరి. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈయన ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు.. ఈ నేపథ్యంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే ఈయనకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ఈ క్రమంలోనే ఒక సినిమా సమయంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరా అని అభిమానులు ఆరా తీయగా..ఆ అమ్మాయి ఒక హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వైవిఎస్ చౌదరి భార్య బ్యాక్ గ్రౌండ్..

ఇకపోతే సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న గీత ( Y.V.S. Chowdhary Wife ) ను వైవిఎస్ చౌదరి లవ్ చేశారు.. ఆ సినిమా సమయం నుంచి చౌదరికి ఆమె మీద ప్రేమ ఉండేది. ఇక అందులో భాగంగానే ఆమెని వివాహం చేసుకున్నారు వైవిఎస్ చౌదరి.. ఇక వివాహనంతరం హీరోయిన్ గీతా కూడా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. మొత్తానికైతే వైవిఎస్ చౌదరి ప్రముఖ హీరోయిన్ గీతా ను వివాహం చేసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. గీతా కూడా వైవాహిక జీవితానికి పరిమితమై మళ్ళీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయలేదు.

- Advertisement -

వైవిఎస్ చౌదరి సినిమాలు..

ప్రస్తుతం డైరెక్టర్ వైవిఎస్ చౌదరి వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.గతంలో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో వరుస ప్లాపుల్లో ఉండి ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయి ఇప్పుడు మళ్ళీ ఒక సినిమాతో రీయంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఒక బడా ఫ్యామిలీ నుంచి వస్తున్న వారుసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసి.. ఆ సినిమా తో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

నందమూరి వారసుడితో రీఎంట్రీ..

ఈ క్రమంలోనే నందమూరి జానకిరామ్ కొడుకు ని హీరోగా పరిచయం చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది.. ఈ సినిమా గనుక సక్సెస్ సాధిస్తే మరొకసారి ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా గుర్తింపు పొందుతారు అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా అటు వైవిఎస్ చౌదరి మళ్లీ సక్సెస్ పొందాలి అని అభిమానులు కోరుకుంటున్నారు అలాగే ఈయన భార్య గీతా కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి వైవిఎస్ చౌదరి, గీత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు