Vijay Devarakonda : ఇప్పుడు అన్ని మూసుకుని కూర్చున్నా… ౩ సినిమాల తర్వాత నేనేంటో చూపిస్తా..!

Vijay Devarakonda : తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట సైడ్ క్యారెక్టర్ లో నటించి ఆ తర్వాత హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త దర్శకులతో సినిమా చేయనని చెప్పడంతో పాటు.. వారికి అనుభవం లేకపోవడం వల్లే బడ్జెట్ నియంత్రణ కోల్పోయి నిర్మాతలు నష్టపోతున్నారంటూ కూడా తెలియజేశారు.

లైగర్ ఎఫెక్ట్…

అయితే గతంలో సీనియర్ హీరో అయినటువంటి పూరీ జగన్నాథ్ తో తీసిన లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లైగర్ సినిమా ఎఫెక్ట్ రౌడీ హీరో పైన భారీగానే పడింది.. లైగర్ సినిమా ఫ్లాప్ తో పాన్ ఇండియా ఆశలన్నీ కూడా విజయ్ దేవర కొండకు అడియాసలే మిగిల్చాయి.. పూరి జగన్నాథ్ మూడేళ్ల శ్రమకు సైతం లైగర్ సినిమా భారీగానే ఫ్లాప్ అయ్యింది.. దీంతో అటు ఛార్మీ ఇటు పూరీ ఇద్దరు కూడా నష్టాల బాట పడ్డారు.. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సమయం ముందు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ హాట్ టాపిక్ గా మారింది.. అంతేకాకుండా లైగర్ సినిమా వల్ల డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు కూడా అవకాశాలు రాలేదు.. అంతేకాదు ఎందుకు హీరోలు కూడా పూరి జగన్నాథ్ కు అవకాశాలు ఇవ్వకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

యాటిట్యూడ్ పై విజయ్ దేవరకొండ స్పందన..

తాజాగా ఒక ఇంటర్వ్యూలోపాల్గొన్న విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అనే పదం పైన మాట్లాడుతూ.. లైగర్ సినిమా ఎఫెక్ట్ వల్ల నా యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు రాలేదని.. కేవలం 3 సినిమాల వరకు అన్నీ మూసుకొని కూర్చుందాం అనుకున్నాను.. మూడు సినిమాలు హిట్ అయ్యాక మళ్ళీ అదే ఆటిట్యూడ్ తో ముందుకు వెళ్తానంటూ కూడా తెలియజేశారు విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా తర్వాత ఖుషి సినిమా చేశారు.. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఏకంగా కోటి రూపాయలు తమ అభిమానులకు పంచడం జరిగింది.

- Advertisement -

అదే ఆటిట్యూడ్ కొనసాగింపు..

ఇప్పుడు తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని తెలియజేశారు. మొత్తానికి అయితే మూడు సినిమాల వరకు ఆటిట్యూడ్ చూపించను అని చెబుతున్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ట్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు ఇక ఇంకొక సినిమా ఎలాంటి కథతో మన ముందుకు వస్తారో తెలియదు ఒకవేళ ఆ సినిమా కూడా విజయం సాధిస్తే మునుపటి ఆటిట్యూడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెబుతున్నారు విజయ్ దేవరకొండ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు