Family Star Run Time : అంత టైం జనాలను కూర్చేబెట్టే సత్తా ఉందా ఫ్యామిలీ స్టార్ కు ?

Family Star Run Time : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు మూవీ కనెక్ట్ అయ్యేలా ఉందనే టాక్ మొదలైంది. గతంలో విజయ్ దేవరకొండకు గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ ఫ్యామిలీ స్టార్ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మరోవైపు ట్రైలర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి తాజాగా రన్ టైం లాక్ అయినట్టు సమాచారం. అయితే ఆ వార్తలు చూశాక అసలు థియేటర్లలో ప్రేక్షకులను అంతసేపు కూర్చోబెట్టగలిగే సత్తా ఫ్యామిలీ స్టార్ కు ఉందా? అనే అనుమానం మొదలైంది.

లాంగ్ రన్ టైంతో రిస్క్ చేస్తున్నారా ?

ఫ్యామిలీ స్టార్ మూవీ సెన్సార్ ఇటీవలే పూర్తి కాగా, ఈ మూవీకి 2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు) రన్ టైంగా లాక్ చేశారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో మేకర్స్ రిస్క్ చేస్తున్నారా అనే డౌట్ వస్తోంది సినీ ప్రియులకు. మామూలుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఎంత క్రిస్ప్ గా ఉంటే అంత మంచిది. కానీ సాదరణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల కంటే ఫ్యామిలీ స్టార్ మూవీకి ఎక్కువ రన్ టైమే ఉంది. 160 నిమిషాల పాటు ప్రేక్షకులను కుర్చీల నుంచి లేచి వెళ్ళిపోకుండా చేయాలంటే ఫ్యామిలీ స్టార్ కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా ఉన్నప్పుడే రన్ టైం అనేది పెద్ద సమస్య కాదు. పొరపాటున ఎక్కడైనా మూవీ ప్రేక్షకులకు బోరింగ్ అనిపిస్తే ఫ్యామిలీ స్టార్ ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. విజయ్ దేవరకొండ గత సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక్క అర్జున్ రెడ్డికి మాత్రమే టైం అనేది అడ్డంకిగా మారలేదు. మరి ఈ మూవీ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు వెయిట్ అండ్ సి.

విజయ్ దేవరకొండ గత సినిమాల రన్ టైం ఎంత అంటే?

విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి మూవీ రన్ టైం 3గంటల 2 నిమిషాలు. సందీప్ రెడ్డి వంగా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయడంతో ఈ మూవీకి రన్ టైం అనేది అడ్డంకిగా మారలేదు, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీకి టాక్ బాగానే ఉన్నా, రన్ టైం వల్ల ఇబ్బందులు తప్పలేదు. ముందుగా ఈ సినిమాకు ఏకంగా 3 గంటల రన్ టైం ఉండగా, అదే దెబ్బేసింది. దీంతో మూవీ థియేటర్లలోకి వచ్చాక తేరుకున్న మేకర్స్ కొన్ని సీన్లు కట్ చేసి రన్ టైం తగ్గించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ 2గంటల 45 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ కూడా విజయ్ దేవరకొండను నిరాశపరిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు