Sharukh Khan Son Abram School Fee : షారుఖ్ కొడుకు స్కూల్ ఫీజు తెలిస్తే ఫ్యూజులు అవుట్

Sharukh Khan Son Abram : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డ కింగ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్, జవాన్ సినిమాలతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ప్రస్తుతం బాలీవుడ్ ను శాసిస్తున్న సీనియర్ హీరోలలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. మరి ఆయన వారసులు, వాళ్ళ చదువులు కూడా కింగ్ ఖాన్ రేంజ్ కు తగ్గట్టుగానే ఉంటాయి. తాజాగా షారుక్ చిన్న కొడుకు అబ్రామ్ స్కూల్ ఫీజు గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అబ్రహం చదువుతున్న స్కూలు, అతని స్కూలు ఫీజు గురించి తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ అబ్రహం స్కూల్ ఫీజు ఎంత? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే…

అబ్రామ్ స్కూల్ ఫీజు ఎంతంటే ?

షారుక్ తనయుడు అబ్రామ్ ( Sharukh Khan Son Abram ) ప్రస్తుతం ముంబైలో ఉన్న ధీరూభాయ్ అంబానీ అనే పాపులర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ అనేది భారతదేశంలోనే అత్యుత్తమ స్కూల్స్ లో ఒకటి. ఈ స్కూల్ ను ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ 2003లో స్థాపించారు. 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అతి పెద్ద పాఠశాలలో ఆధునిక సౌకర్యాలకు కూడా కొదవేం లేదు. మొత్తం ఏడంతస్తులు ఉన్న ఈ పాఠశాల భవనంలో ప్లే గ్రౌండ్, టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్, టెన్నిస్ కోర్ట్, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో కూడా అబ్రామ్ చురుగ్గా కనిపించాడు.

ఈ వేడుకలో అబ్రామ్ తన తండ్రి షారుక్ సిగ్నేచర్ ఫొజ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ పాఠశాలలో పలువురు రాజకీయవేత్తలు, స్పోర్ట్స్ పర్సన్స్, సినీ ప్రముఖుల పిల్లలు చదువుకుంటారు. అత్యంత ఖరీదైన ఈ స్కూల్లోనే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తనయుడు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య కూడా చదువుకుంటున్నారు. మరి ఇలాంటి సెలబ్రిటీల పిల్లలు చదువుకునే ఈ స్కూల్లో ఫీజు ఎంతుంటుందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు ఒక్కో తరగతికి ఒక్కోలా ఉంటాయి. ఎల్కేజీ నుంచి ఏడవ తరగతి వరకు ప్రతినెల 1.70 లక్షలకు పైగానే ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతినెల 4.48 లక్షల ఫీజు ఉంటుంది. ఆపై చదువులు అంటే 11, 12 తరగతిలో ఫీజు ప్రతినెల దాదాపు 9.65 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే అబ్రామ్ స్కూల్ ఫీజు ఏడాదికి 20.40 లక్షలు అన్నమాట.

- Advertisement -

షారుఖ్ సినిమాల విషయానికి వస్తే…

2023 క్రిస్మస్ కానుకగా డంకీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు షారుక్ ఖాన్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో షారుక్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. షారుక్ నెక్స్ట్ మూవీ గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు