April OTT Movies : ఏప్రిల్‌లో ఓటిటిలోకి రాబోతున్న సినిమాలు ఇవే

April OTT Movies : థియేటర్లలో సమ్మర్ సందడి మొదలైపోయింది. మరోవైపు ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఓటీటిల్లోకి కొత్త నెలలో కొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో పాపులర్ ఓటీటీలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో రిలీజ్ కాబోతున్న టాప్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైరన్, హనుమాన్, గామి, భీమా వంటి సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఏ మూవీని ఎక్కడ, ఈ నెలలో రిలీజ్ ( April OTT Movies ) కాబోతున్న సినిమాలు ఏంటి అనే విషయంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

1. భీమా

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ ఏప్రిల్ నెలలో ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 5 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషలో అందుబాటులోకి రాబోతోంది.

2. ప్రేమలు

ఈ మలయాళ మూవీ తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ మార్చి 29నే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఏప్రిల్ 12 నుంచి హాట్ స్టార్ లో ప్రేమలు మూవీ స్ట్రీమింగ్ కానునట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ గురించి ఓటీటీ ప్రియులు ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

3. లంబసింగి

నక్సలైట్ కూతురిని ప్రేమించే కానిస్టేబుల్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ లంబసింగి. బిగ్ బాస్ దివి ఇందులో హీరోయిన్ గా నటించింది. గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన లంబసింగి మూవీ ఏప్రిల్ 2 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

4. హనుమాన్

హనుమాన్ మూవీ తెలుగు, హిందీ ఓటిటి వెర్షన్లలో ఇప్పటికే జీ5, జియో సినిమాల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏప్రిల్ 5 నుంచి కన్నడ, తమిళ, మలయాళం వెర్షన్లు హాట్ స్టార్ లో అందుబాటులోకి రానున్నాయి.

5. సైరన్

జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ క్రైం థ్రిల్లర్ మూవీ సైరన్ ఏప్రిల్ 11 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

6. మంజుమ్మెల్ బాయ్స్

ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మలయాళ మూవీ అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈనెల చివర్లో మంజుమ్మెల్ బాయ్స్ హాట్ స్టార్ లోకి రాబోతోంది.

ప్రైమ్ వీడియో – ఓం భీమ్ బుష్

గత నెలలో రిలీజ్ అయిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెలలో స్ట్రీమింగ్ కాబోతోంది.

జీ 5 – గామి

విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి మూవీ కూడా ఈ నెలలోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. భీమాతో పాటే థియేటర్లలోకి వచ్చిన గామి మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

సోనీ లివ్ – అదృశ్యం

ఏప్రిల్ 11 నుంచి ప్రతి గురు, శుక్రవారం లో రాత్రి 8 గంటలకు అదృశ్యం అనే టీవీ సిరీస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

నెట్ ఫ్లిక్స్ – పారాసైట్ – ది గ్రే

పారాసైట్ – ది గ్రే అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

చీఫ్ డిటెక్టివ్

చీఫ్ డిటెక్టివ్ అనే కొరియన్ డ్రామా ఏప్రిల్ 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు