BRO : త్రివిక్రమ్ ,బండ్ల గణేష్ కి మధ్య గొడవేంటి ?

గత కొద్దిరోజులుగా త్రివిక్రమ్ కి , బండ్ల గణేష్ కి మనస్పర్థలు ఉన్నాయనే అందరికి తెల్సిన విషయమే. కానీ అసలు వీరిద్దరి మధ్య గొడవేంటి అనేది మాత్రం ఎక్కువ మందికి తెలియదు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ చేసిన ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన బండ్ల గణేష్ యాక్టర్ గా అందరికి పరిచయస్తుడే. యాక్టర్ గా పలు సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి, పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా ఆంజనేయులు అనే తీశారు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ అనే తీసాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి గబ్బర్ సింగ్ సినిమాతో మరోసారి అవకాశం ఇవ్వగా, ఆ సినిమా సూపర్ హిట్టై, భారీ వసూళ్ళని రాబట్టింది.

గబ్బర్ సింగ్ సినిమా తరువాత నుంచి బండ్ల గణేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత నుంచి ఆయన ప్రొడ్యూసింగ్ చేసిన సినిమాలన్ని మంచి విజయాన్ని సాధించాయి.

- Advertisement -

అయితే బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అవడం వల్ల స్టేజి పైన పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా పొగిడేవాడు.ఆ స్పీచ్ లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యేవి. దాంతో పవన్ కళ్యాణ్ ప్రతి ఈవెంట్ కి బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ గా నిలిచేది. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమా అయిన వకీల్ సాబ్ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ స్పీచే హైలెట్ అయింది. అయితే ఆ తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి కూడా బండ్ల గణేష్ వెళ్ళాల్సింది ఉండగా త్రివిక్రమ్, బండ్ల గణేష్ ని రానీయకుండా చేసాడని అప్పట్లో ఒక రూమర్ వచ్చింది. దాంతో హర్ట్ అయిన బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాసే, పవన్ కళ్యాణ్ కి తనని దూరం చేస్తున్నడని ట్విట్టర్ లో బాహాటంగానే ట్వీట్స్ చేసాడు.

అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ మరోసారి ట్వీట్ చేసాడు. ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఎం చేయాలని ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా త్రివిక్రమ్ విలువైన గిఫ్ట్ ఇస్తే చాలు ప్రొడ్యూసర్ అయిపోతావ్ అని చెబుతూఅలాగే త్రివిక్రమ్ ఎవరినైనా విడదీయగలడు, భార్య భర్తలైన , తండ్రి కొడుకులైన, గురు శిష్యులైన, విడదీయటమే ఆయన స్పెషాలిటీ అంటూ ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.

For More Updates :=

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు