Teja: డబ్బుల కోసం సదా ఆ స్టార్ హీరోని మోసం చేసిందా..?

యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సదా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన మాటలతో, అందంతో, నటనతో కట్టిపడేసింది సదా. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

తెలుగుతోపాటు తమిళ్ లోను సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాతో భారీ హీట్ ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయింది సదా. అయితే కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జిగా చేస్తుంది.

ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె మొదటి సినిమాలో నితిన్ తో జయం సినిమాలో హీరోయిన్ గా నటించగ, ఆ తరువాత డైరెక్టర్ తేజ జయం 2 చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇదే చనువుతో నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని సదాని సంప్రదించారట.

- Advertisement -

అయితే ఇందుకు మొదట పాజిటివ్ గానే స్పందించిన సదా.. చాలా రోజులపాటు వెయిట్ చేయించి ఆ తర్వాత ఆమెకు వేరే సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలో ఐటమ్ గా చేయమంటావా..? అని ప్రశ్నించిందట. మీతో హీరోయిన్ గా చేసి.. మళ్లీ మీతోనే ఐటెం సాంగ్ ఎలా చేయమంటావని.. ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా..? అంటూ దారుణంగా కామెంట్ చేసిందట. దీంతో నితిన్ ఏమీ అనలేక సారీ అంటూ సైలెంట్ గా ఫోన్ పెట్టేశారట. అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో సదా డబ్బుల కోసం ఇలా మనుషుల్ని చీట్ చేస్తుందా..? అంటూ ట్రోల్ చేశారు నెటిజెన్స్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు