HBD Sunil : ఈ సినిమాల సక్సెస్ లో మేజర్ క్రెడిట్ సునీల్ కే..!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా కొనసాగిన సునీల్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సునీల్ ఇప్పుడు ఎంత బిజీగా అయినా, మరెంత గుర్తింపు తెచ్చుకున్నా, ఒకప్పుడు కమెడియన్ గా ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదనేది వాస్తవం. ముందు ముందు మరింత మంచి నటుడుగా గుర్తింపు తెచుకున్నా, ఒకప్పుడు చూసిన మన సునీల్ ని మాత్రం తిరిగి చూడలేము. అయితే ఒకప్పుడు సునీల్ ఉంటే సినిమా హిట్టే అనే రేంజ్ లో ఆడియన్స్ అనుకునేవారు. ఇంకా చెప్పాలంటే సునీల్ లేకపోతే ఆ సినిమాలు అంత విజయం సాధించేవి కావేమో అనిపించేవి. అలాంటి చిత్రాల్లో ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండే పాత్రలపై ఒక్కసారి లుక్కేద్దాం..

1. నువ్వు లేక నేను లేను – కర్రి శీను
తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో సునీల్ కర్రి శీనుగా నటించాడు. సినిమా మొదలైన ఓ అరగంట తర్వాత సునీల్ ఎంట్రీ ఇచ్చి క్లైమాక్ వరకూ నవ్విస్తూనే ఉంటాడు. కొన్ని సీన్లలో బ్రహ్మానందం పాత్రని కూడా ఈ సినిమా బీట్ చేసాడు సునీల్. అప్పట్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా విజయంలో సునీల్ కి సగం క్రెడిట్ ఇచ్చేయొచ్చు.

2. సొంతం – శేషం
సునీల్ నటించిన సినిమాల్లో ఈ సినిమాకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీనువైట్ల దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాతో ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అయినా, సినిమా మొత్తాన్ని సునీల్ నడిపిస్తాడు అనిపిస్తుంది. చాలా మంది ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కన్నా, సునీల్ కోసమే చూస్తారని తెలుసా. ఈ మధ్య వెంకీ మూవీ రీ రిలీజ్ అయినపుడు ఎలాగైతే హీరో ఎంట్రీ కంటే బ్రహ్మానందం ఎంట్రీ కి విజిల్స్, పేపర్లు పడ్డాయో, ఆ రేంజ్ రెస్పాన్స్ సొంతం రీ రిలీజ్ అయితే సునీల్ ఎంట్రీకి వస్తుంది. శేషం గా ఈ సినిమాలో సునీల్ పెర్ఫార్మన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సునీల్ లేకపోతే ఈ సినిమా ప్లాపయ్యేదేమో.

- Advertisement -

3. నువ్వే నువ్వే – పండు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో సునీల్ పండుగా నటించాడు. తన స్నేహితుడైన త్రివిక్రమ్ సలహా తో కమెడియన్ అయిన సునీల్, త్రివిక్రమ్ ఫస్ట్ సినిమా అయిన నువ్వే నువ్వే లో నటించాడు. ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ తో సునీల్ తన గురించి చెప్తూ ఒక సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు పండు క్యారెక్టర్ ఏ రేంజ్ లో కామెడీ పండించిందో చెప్పడానికి.

4. చెప్పవే చిరుగాలి – గోపి
తొట్టెంపూడి వేణు హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం డీసెంట్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో సునీల్ లేకపోతే మూవీ ఎంత బాగున్నా హిట్టయ్యేది కాదేమో అనిపిస్తుంది. సునీల్ గోపి అనే పాత్రలో నటించిన ఈ సినిమాలో పాటల్ని మినహాయిస్తే కేవలం సునీల్ కోసమే చూస్తారనడం ఓ అతిశయోక్తి కాదు.

5. ఆనందమానందమాయే – శీను
ఆకాష్ హీరోగా వచ్చిన ఈ సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలోనే వచ్చింది. ఈ సినిమాలో పంచతంత్రం శీను గా సునీల్ పండించిన హాస్యం ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా మాస్టర్ భరత్ తో సునీల్ ఉన్న ప్రతీ సీన్ లో పంచులు సంచుల నిండా వస్తాయి.

ఇవే గాక సునీల్ నటించిన సినిమాల్లో నువ్వు నేను, మనసంతా నువ్వే, వాసు, మన్మధుడు, నీ మనసు నాకు తెలుసు, అతడు, జై చిరంజీవ వంటి సినిమాల్లో కూడా ఓ రేంజ్ కామెడిని పండించాడు. ఏది ఏమైనా అప్పటి సునీల్ మాత్రం మనకు మళ్ళీ రాడేమో కాబోలు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు