Raja Sekhar: అప్పుడు త్రివిక్రమ్ కి నో ఇప్పుడు అందరికీ యస్

యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ గురించి ఇప్పుడున్న ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు రాజశేఖర్ చాలా గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. తలంబ్రాలు, శృతిలయలు, ఆహుతి, అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు ఓంకారం, సూర్యుడు, శివయ్య, మా అన్నయ్య, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు వంటి ఎన్నో సినిమాలు రాజశేఖర్ ని మంచి హీరోని చేశాయి.

ఇప్పుడు రాజశేఖర్ అంటే చాలామందికి తక్కువగా కనిపించొచ్చు. కానీ ఒకప్పుడు రాజశేఖర్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి వెళ్లేవారు. ఎందుకంటే అన్ని జోనర్స్ లో కూడా సినిమాలు చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు రాజశేఖర్. అయితే ఒక టైం లో రాజశేఖర్ హిట్ సినిమా చూడడానికి చాలా టైం పట్టింది.వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు చేస్తూ చాలా ఇమేజ్ పోగొట్టుకున్నారు.

అంతేకాకుండా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూ కూడా మెగాస్టార్ విభేదాలు తెచ్చుకుని, మెగా ఫ్యామిలీని దూషించడం వలన చాలామందికి యాంటీగా మిగిలిపోయారు డాక్టర్ రాజశేఖర్. ఒక టైం లో మెగా ఫ్యాన్స్ కూడా రాజశేఖర్ కుటుంబం పైన దాడి చేశారు. అయితే రాజశేఖర్ కి మళ్ళీ హిట్ సినిమా పడటానికి చాలా ఏళ్లు పట్టింది. వరుసగా డిజాస్టర్ సినిమాలు వస్తున్న టైం లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా రాజశేఖర్ కి మంచి హిట్ గా నిలిచింది. మళ్లీ హీరోగా ఫామ్ లో నిలబెట్టింది. ఇకపోతే ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు రాజశేఖర్.

- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేసిన క్యారెక్టర్ కోసం మొదట రాజశేఖర్ ని సంప్రదించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఇది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ అని తాను హీరోగా చేసి ఉన్నానని ఇదివరకే చెప్పటం వలన ఆ క్యారెక్టర్ ను మిస్ అయ్యాడు. ఒకవేళ ఆ క్యారెక్టర్ కానీ రాజశేఖర్ కి పడి ఉంటే ఇప్పుడు జగపతిబాబు ఫామ్ లో ఉన్నట్టు రాజశేఖర్ కూడా మంచి ఫామ్ లో ఉండేవాడు.

ఒక ఏజ్ వచ్చిన తర్వాత హీరోగా కంటే కూడా తనలో ఉన్న మరో నటుడిని బయటికి తీసి సినిమాలు చేయటం అనేది గొప్ప విషయం. రాజశేఖర్ చివరగా నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మాన్ సినిమాలో కనిపించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ నటిస్తున్న సినిమాలో రాజశేఖర్ కనిపించినట్లు తెలుస్తుంది. అయితే శర్వానంద్ కి తండ్రి పాత్రలో రాజశేఖర్ నటించినున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. లూజర్ అనే వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడుగా పరిచయమైన అభిలాష్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర విలక్షణంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు తన కొడుకు అయినా శర్వా గొడవ పడుతూ ఉంటాడని, యాంగ్రీ యంగ్ మెన్ గా మళ్ళీ మనం ఈ సినిమాలో చూడొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ సరసున మాళవిక నాయర్ నటిస్తోంది. శర్వానంద్ కెరీర్ లోనే అత్యంత హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు