HBD Sunil: సునీల్ భార్య, పిల్లలు ఎవరు.. కుటుంబ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమాతో విలన్ గా మారి సత్తా చాటుతున్న ఈయన ఎంత పాపులారిటీ దక్కించుకున్నప్పటికీ.. తన కుటుంబాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతారనటంలో సందేహం లేదు.. అందుకే సునీల్ కుటుంబ సభ్యుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి.. నువ్వే కావాలి సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన సునీల్.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి చిత్రాలలో నటించి పాపులర్ అవ్వడమే కాదు అప్పట్లో ఏడాదికి 20 సినిమాలకు పైగా చేసేవారు..

తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించిన సునీల్.. జ్యూరీ లని కూడా మెప్పించారు.. అందుకే నంది అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా లభించాయి. సునీల్ సినిమా జీవితం తెరిచిన పుస్తకమే కానీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా గోప్యంగా ఉంటుంది.. ఇక ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఏ వివరాలు కూడా చాలామందికి తెలియదు.. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలు వైరల్ అవుతున్నాయి.

భీమవరంలో పుట్టిన సునీల్.. స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఈయన తండ్రి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిగా పనిచేసే వారు.. అయితే సునీల్ ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన స్వర్గస్తులవడంతో.. ఆ ఉద్యోగం సునీల్ తల్లికి ఇచ్చారు.. అప్పటినుంచి ఆమె సునీల్ ఆలనా పాలనా చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు సునీల్.. సునీల్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈయన భార్య పేరు శృతి ఇందుకూరి.. ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు.. పైగా సునీల్ తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు.

- Advertisement -

ఇక సునీల్ శృతి ఇందుకూరి దంపతులకు ఒక పాప, బాబు కూడా జన్మించారు. శృతి సునీల్ కి బంధువుల అమ్మాయి కావడం విశేషం. ఇకపోతే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. సునీల్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఒక్కో సినిమాకు రూ .3నుంచి రూ .5కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న సునీల్ ఆస్తి పాస్తుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు దాదాపు 200కి పైగా సినిమాలలో నటించిన సునీల్.. ఒక్కరోజు షూటింగ్లో పాల్గొంటే రూ.4లక్షల వరకు పారితోషకం తీసుకుంటారు.. ఇక సినిమాల ద్వారా దాదాపుగా రూ .200 కోట్ల వరకు సంపాదించారని సమాచారం… వీటితోపాటు జూబ్లీహిల్స్ లో రూ .3కోట్ల విలువైన విలాసవంతమైన భవనంతో పాటు 3 లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ లో విలన్ పాత్ర పోషిస్తున్నారు..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు