Shankar: ఎన్నాళ్లో వేచిన తరుణం

తను దర్శకుడు కావడానికంటే ముందు దాదాపు 17 ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు దర్శకుడు శంకర్. ఇప్పటి జనరేషన్ పీపుల్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు శంకర్ సినిమా అంటే వేరే లెవెల్ లో ఉండేది. ఆ సినిమాకు ఉండే గ్రాండియర్. ఆ సినిమాలో కాన్సెప్ట్స్. ఆ సినిమాలోని పర్ఫామెన్స్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అని చెప్పొచ్చు.

ఇప్పుడు తెలుగు సినిమా ఖండాలు దాటింది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తుంది. దీని కారణం బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప వంటి సినిమాలు అని చెప్పొచ్చు. తెలుగు సినిమా అంటే చాలామందికి ఒకప్పుడు చాలా చిన్న చూపుగా ఉండేది. ఇదే విషయంలో చాలాసార్లు మెగాస్టార్ చిరంజీవి కూడా గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్టీఆర్ ఫోటో లేదు అంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి తెలుగు సినిమా నేడు ఎక్కడెక్కడికో చేరింది.

ఇదంతా ఇప్పుడు. కానీ ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఇటు తెలుగులోను అటు తమిళ్ లోను ఇద్దరికీ ఒక క్యూరియాసిటీ. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. శంకర్ సినిమా అంటే అదో కొత్త ప్రపంచం. శంకర్ ను ఇండియన్ జేమ్స్ కామెరాన్ అని కూడా అంటారు. ఎందుకంటే శంకర్ చేసే సినిమాలు అంత గ్రాండియర్ గా ఉండేవి.

- Advertisement -

ప్రస్తుతం శంకర్ నుంచి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయింది. శంకర్ నుంచి చివరగా వచ్చిన సినిమా రోబో 2. ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాకు హైప్ పెరగడానికి ముఖ్య కారణం రోబో సినిమా హిట్ అయిన స్థాయి. రజినీకాంత్ నటించిన రోబో సినిమా మామూలు రేంజ్ లో హిట్ కాలేదు. సో రోబో 2 వచ్చినప్పుడు అందరు ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో పెరిగాయి. కానీ అవి అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు.

ఇకపోతే ప్రస్తుతం శంకర్ రెండు సినిమాలు పైన వర్క్ చేస్తున్నారు. ఒకటి ఇండియన్ 2. ఇండియన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే ఇండియన్ సినిమా తెలుగులో భారతీయుడుగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇండియన్ 2 సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధపడుతుంది. ఇదే షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రాణాలు కోల్పోయారు.

శంకర్ ఇండియన్ 2 సినిమా తో పాటుగా రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను కూడా ప్లాన్ చేశాడు. ఆ సినిమా కూడా దాదాపు చివరి దశలో ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్ మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు