Ram Charan : ఈ ఏడాదిని వదిలే ప్రసక్తే లేదంటున్న ‘గేమ్ ఛేంజర్’..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమా ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తుతం హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు శంకర్ షణ్ముగం రామ్ చరణ్ పై పలు ఆక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏదైనా ఉందంటే అది రిలీజ్ డేట్ విషయమే. గత మూడేళ్ళుగా షూటింగ్ జరువుకుంటూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంటున్నా ఇంకా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోలేదు. పైగా శంకర్ మధ్యలో గేమ్ ఛేంజర్ ని పక్కన పెట్టి ఇండియన్ 2 షూటింగ్ లో పడ్డాడు.

ఇక ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ గత కొన్ని రోజులుగా రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది. ఈ మాట అటుంచితే ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. దాదాపు 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ ని నిర్మిస్తున్నాడు. అయితే దిల్ రాజు కెరీర్ లో ఎప్పుడు కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఇంత టైం తీసుకోలేదు. పైగా షూటింగ్ మొదలెట్టిన టైం నుండి రిలీజ్ అయ్యే దాకా తన సినిమాని దగ్గరుండి చూసుకుంటాడు. అలాంటిది తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి ఎందుకు అంత పట్టించుకోకుండా ఉన్నాడో అని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్న తమ సినిమాను ఈ ఇయర్ లో ఖచ్చితంగా విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. అయితే సమ్మర్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేదు. జులై వరకూ గేమ్ ఛేంజర్ మొత్తం పూర్తయితే సినిమాను సెప్టెంబర్ లో గాని లేదా అక్టోబర్ లో గాని, అంటే వినాయక చవితి లేదా, దసరాకి తమ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. అయితే దిల్ రాజుకి పోటీపడడం మాత్రం ఇష్టం లేదట. అందుకే ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన ఓజి, దేవర లాంటి సినిమాల్లో ఫైనల్ గా ఆ టైం కి ఖచ్చితంగా ఏవి వస్తాయో, రావో
అన్న విషయం చూసుకుని గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను డిసైడ్ చేస్తారని సమాచారం. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ ఈ ఇయర్ వస్తేనే అన్ని రకాలుగా మంచిదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు