Tollywood : ప్రముఖ యాంకర్ కిడ్నాప్ కలకలం.. సినిమా రేంజ్ లో ట్విస్ట్?

ప్రస్తుతం ఇండియా లో సినిమాలను ఇన్స్పైర్ అయ్యి చాలా కథలు నడుస్తున్నాయి. ఒకప్పుడు రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్లనే కథలుగా తీసేవారు. కానీ జనాలు ఇప్పుడు సినిమాల్లో చూపించే కథల్ని నిజం చేస్తున్నట్టనిపిస్తుంది. అప్పుడప్పుడూ బయట జరిగే కొన్ని కథలు చూస్తే అలాగే అనిపిస్తుంది మరి. లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక వ్యక్తి పెళ్ళికి నిరాకరించారని ఏకంగా కిడ్నాప్ చేసిన వార్త కలకలం రేపుతోంది. ఇలాంటి న్యూస్ లు చాలా చూసాం అంటారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది అమ్మాయి కాదు, అబ్బాయి. అవును.. కాలం మారింది అంతే..

ఇక అసలు విషయానికొస్తే.. హైదరాబాద్ లో ప్రముఖ ఛానెల్ లో టీవీ యాంకర్ అయిన ప్రణవ్‌ అనే యువకుడ్ని త్రిష అనే యువతి ఓ మ్యారేజ్ మ్యాట్రిమోని వెబ్ సైట్ లో చూసి మోజు పడింది. ఇక ఈ త్రిష అనే యువతి 5 స్టార్టప్ కంపెనీలకు MD కాగా, ఒక డిజిటల్ మార్కెటర్ కూడా. ప్రణవ్ ని చూసిన వెంటనే ఇష్టపడి ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి, మ్యాట్రిమోనీ సైట్ లో ఉన్న ఐడీలో ఉన్న నెంబర్లతో కాంటక్టు చేసింది. ముందుగా కొన్ని రోజులు ఫోన్ కాంటాక్ట్ లోనే నడిచిన వ్యవహారం కాస్త కలుద్దామనేసరికి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు.

అయితే అక్కడితో లైట్ తీసుకోకుండా ప్రణవ్ నే పెళ్ళిచేసుకోవాలని ఫిక్స్ అయింది. మళ్ళీ ప్రణవ్ ని కాంటాక్ట్ అయ్యి త్రిష మ్యారేజ్ ప్రపోజల్ తీసుకువచ్చింది. కానీ ఈ పెళ్లి ప్రతిపాదనని ప్రణవ్ తిరస్కరించడంతో ఏకంగా కిడ్నాప్ చేసేసింది. అయితే త్రిష ముందు నుండి డబ్బు పరపతిగల కోటీశ్వరురాలు కూడా కావడంతో ఎలాగైనా ప్రణవ్ ని దక్కించుకోవాలని ఫిక్స్ అయింది. ఇక అఫిషియల్ గా వచ్చిన సమాచారం ప్రకారం, కొందరు రౌడీల సహాయంతో త్రిష ప్రణవ్‌ని కిడ్నాప్ చేసి కొన్ని రోజుల క్రితం తన గదిలో బంధించింది. అదృష్టవశాత్తూ అతడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

- Advertisement -

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. కిడ్నాప్ చేయించిన త్రిష ను పోలీసులు తాజాగా ఉప్పల్‌లో అరెస్ట్ చేశారు. అయితే కిడ్నాప్ విషయంపై ఆమెను ఆరా తీయగా, మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫొటోలు చూసి ఇష్టపడినట్టు పెళ్లి కోసమే తనను కిడ్నాప్ చేసానని చెప్పింది. అయితే ఇక్కడ బయటపడ్డ అసలు ట్విస్ట్ ఏంటంటే.. పోలీసుల విచారణలో అసలు ఆ మ్యాట్రిమోనీ సైట్‌లో ఉన్న ఐడీ ప్రణవ్‌దే కాదని, సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఒక ఫేక్ ప్రొఫైల్‌ ఐడిగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం త్రిషను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు