Mastu Shades Unnai Raa Movie Review మస్తు షేడ్స్ ఉన్నయ్ రా రివ్యూ

ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా నీలో’ అనే ఒక్క డైలాగ్ తో స్టార్ అయిపోయాడు అభినవ్ గోమఠం. ఆ ఒక్క డైలాగ్ అతనికి బోలెడు ఆఫర్లు తీసుకొచ్చింది. అదే డైలాగ్ తో ఓ సినిమా కూడా చేసేసాడు. మరి హీరోగా అభినవ్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి :

కథ :

మనోహర్(అభినవ్ గోమఠం) కి చదువు పై ఇంట్రెస్ట్ ఉండదు. టెన్త్ క్లాస్ లోనే చదువు ఆపేసి గోడ మీద పెయింటింగ్లు వంటివి వేస్తూ ఉంటాడు. పైగా తన తండ్రి కూడా చనిపోవడంతో కుటుంబ భారం అతనిపై పడుతుంది. ఇదిలా ఉండగా.. అతను లైఫ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది. అతనికి పెళ్లి ఫిక్స్ అయితే ఆ అమ్మాయి వేరే వాడితో వెళ్ళిపోడంతో .. పెళ్లి ఆగిపోతుంది. తర్వాత సొంతంగా ఫ్లెక్సీల బిజినెస్ పెట్టుకుందాం అంటే పిడిగి పడి మిషన్ కాలిపోతుంది. మరోపక్క అతని స్నేహితుడు రాహుల్(అలీ రెజా) .. మనోహర్ ను అనుక్షణం దెబ్బ తీయాలని చూస్తూ ఉంటాడు. మనోహర్ ప్రియురాలు ఉమా(వైశాలి) మధ్యలో ఫిటింగ్ కూడా పెట్టేస్తాడు రాహుల్. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి అతను లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు. అతని ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ.

- Advertisement -

విశ్లేషణ :

కమెడియన్ ని హీరోగా పెట్టి సినిమా చేయడం అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే కమెడియన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. కానీ అతన్ని ఏ పాత్రలో ఫిట్ చేయాలి అనేది దర్శకుడికి పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. దర్శకుడు తిరుపతి రావు.. అభినవ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథని డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆ కథని ఆసక్తిగా తెరపై ఆవిష్కరించడంలో అతను ఫెయిల్ అయ్యాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. పెద్దగా ఆసక్తికరమైన సీన్స్ ఏమీ పడలేదు. అభినవ్ కామెడీ టైమింగ్ ని కూడా దర్శకుడు వాడుకోలేదు. లవ్ స్టోరీ కూడా ఆకర్షించే విధంగా ఉండదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. స్టార్టింగ్ పోర్షన్స్ ఫస్టాఫ్ కంటే ఘోరంగా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ కొంతవరకు ఓకే. కానీ అప్పటికే ప్రేక్షకులకి అప్పటి వరకు ఓపిక ఉండకపోవచ్చు. అంతేకాదు చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అవుతుంది. ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి రాహుల్(అలీ రెజా) , ఉన్నత చదువులు చదివి మరీ పల్లెటూరిలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుకోవడం ఏంటో దర్శకుడికే తెలియాలి. ఇక హీరో మిషన్ పాడైనప్పటికీ డిజైన్స్ చేసి సిటీ నుండి ప్రింట్ చేయించుకుని తీసుకొస్తాడు. అయినా ఆ ఊరి జనాలు అతను ఏదో తప్పు చేసినట్టు షాప్ ఖాళీ చేయిస్తారు. ఇలాంటి వాటిలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏముంటుంది.? ఏముంది? అనేది కూడా దర్శకుడికే తెలియాలి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. సినిమాలో చాలా షాట్స్ వి లాగర్స్ నుండీ కొనేసినట్టు ఉన్నారు. పోనీ ఏవైనా క్వాలిటీగా ఉన్నాయా అంటే లేదు. మన మొబైల్ ఫోన్ లో తీసినట్టు ఉన్నాయి. డబ్బింగ్ విషయంలో కూడా చాలా డిస్టర్బన్స్ లు ఉన్నాయి. ఏ కోశానా కూడా కనీస స్థాయి నిర్మాణ విలువలు లేని సినిమా ఇది.

అభినవ్ గోమఠం నటన గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది. హీరోగా కూడా అతను పనికొస్తాడు అని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. దర్శకుడు అతన్ని పూర్తిగా వాడుకోలేదు అంతే. అలీ రెజా బాగానే చేశాడు. హీరోయిన్ వైష్ణవి ఓకే. మిగిలిన నటీనటులు జస్ట్ ఓకే అనిపిస్తారు.

ప్లస్ పాయింట్స్ :

అభినవ్ గోమఠం

స్టోరీ లైన్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

లాజిక్ లెస్ సీన్స్, ఎమోషన్స్

మొత్తంగా ..

‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ లో అభినవ్ షేడ్స్ బాగున్నాయి. మిగిలిన షేడ్స్ ఏమీ ఆకట్టుకునే విధంగా ఉండవు.

రేటింగ్ : 1/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు