Jayapradha: పరారీలో జయప్రద.. కౌంట్ డౌన్ విధించిన కోర్టు..!

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద పై రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే.. తనపై ఉన్న ఈ రెండు కేసుల్లో విచారణకు హాజరు కాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఆమె పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ కేసులు 2019 లోకసభ ఎన్నికల సమయంలో బీజేపీ కి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నమోదయ్యాయి..ఇవి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు సంబంధించిన కేసులు కావడం గమనార్హం.. ఇప్పటికే ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారంటీలు జారీ చేసినప్పటికీ జయప్రద మాత్రం కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆమెపై ఎంపి, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్ట్ కఠిన చర్యలు తీసుకుంది.. ముఖ్యంగా మార్చి ఆరవ తేదీన జయప్రద కోర్టుకు హాజరయ్యే విధంగా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని ప్రముఖ న్యాయమూర్తి శోభిత్ బన్సార్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

జయప్రద పై సెక్షన్ 82 CrPC కింద చర్య తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.. ఇకపోతే గతంలో రాజ్యసభ ఎంపీ గానూ.. లోకసభ ఎంపీ గానూ పని చేసింది జయప్రద.. ఇక రాంపూర్ నియోజకవర్గం లో అజమ్ ఖాన్ తో వివాదాలు వచ్చిన నేపథ్యంలో సమాజ్వాది పార్టీ నుంచి వైదొలిగి 2019లో బిజెపిలో చేరింది.. గత లోకసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈమె 2019లో జరిగిన ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్టు రెండు కేసులు నమోదయ్యాయి.. ఈ రెండు కేసులు కోర్టు విచారణకి కూడా వచ్చాయి.. నాన్ బెయిలబుల్ వారంటీలు కూడా జారీ చేశారు .. కానీ ఆమె మాత్రం కోర్టుకి హాజరు కాలేదు.. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లు.. మార్చ్ ఆరవ తేదీ కచ్చితంగా ఈమెను కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తులు.. మరి దీనిపై జయప్రద ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి..

ఇక జయప్రద కెరియర్ విషయానికి వస్తే.. 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించిన ఈమె.. డాక్టర్ కావాలని అనుకుంది..కానీ యాక్టర్ అయ్యింది. ఇక 14 సంవత్సరాల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా.. సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఈమెను చూసి జయప్రద అని నామకరణం చేసి.. 1976లో విడుదలైన భూమికోసం అనే సినిమాలో మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక పాట ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు.

- Advertisement -

అలా మొదలైన ఈమె ప్రస్థానం 2005 వరకు దాదాపు 3 దశాబ్దాలలో 6 భాషలలో 300కు పైగా సినిమాలలో నటించి రికార్డు సృష్టించింది. తెలుగు ,తమిళ్ ,మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జయప్ర..ద నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీలో చేరింది.. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలు అయిన ఈమె.. 1996 ఏప్రిల్ 4న రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయి.. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్వాది పార్టీలో చేరింది.. ఇక ఇప్పుడు ఈ రాజకీయాల వల్లే చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు