Bollywood: సిక్స్ ప్యాక్ బాడీ.. తాప్సీకి ఇప్పుడెందుకు ?

తాప్సీ పన్ను.. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సొట్ట బుగ్గల సుందరిగా సుపరిచితం. ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్, సాహాసం, షాడో వంటి సినిమాలతో తాప్సీకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే తర్వాత ఈమె బాలీవుడ్ బాట పట్టడంతో తెలుగులో అవకాశాలతో పాటు ఇమేజ్ కూడా కనుమరుగు అయిపోయింది. ప్రస్తుతం ఈ సొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

అయితే తాప్సీ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోను చూసి అభిమానులు, సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. ఇందులో తాప్సీ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తుంది. జిమ్ ట్రైనర్ తో కలిసి, తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా క్యూట్ గా ఉండే తాప్సీ, ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో స్టిఫ్ గా, సూపర్ గా కనిపిస్తుంది. హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సిక్స్ ప్యాక్ పెంచడంపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

అయితే ఉన్నట్టుండి తాప్సీ ఎందుకు సిక్స్ ప్యాక్ వచ్చేలా ఎందుకు కష్టపడాల్సి వచ్చింది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి డుంకీ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే నామ్ షబానా సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రంలోనూ తాప్సీ నటిస్తుంది. ఇది స్పై యాక్షన్ చిత్రం కాబట్టి, అందులో తాప్సీ చేసే పాత్ర కోసం సిక్స్ ప్యాక్ ను రెడీ చేసుకుందా ? లేదా నార్మల్ గానే ఇలా చేసిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా, సిక్స్ ప్యాక్ లుక్ తో తాప్సీ అదిరిపోయిందని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు