Tollywood: ఆఫర్స్ లేకున్నా.. కూతురి కోసం కాస్ట్‌లీ కారు కొన్న సురేఖా వాణి

నటి సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో కనిపించిన సురేఖా వాణికి ప్రస్తుతం అవకాశాలు పెద్దగా రావడం లేదు. తాను ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధమని ప్రకటించిన కూడా ఈమెకు ఛాన్స్ లు రావడం లేదు. సినిమాలు లేకపోవడంతో, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటుంది. తన కూతురు సుప్రీతతో కలిసి పార్టీలకు, పబ్ లకు వెళ్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

తల్లీ కూతళ్లు గ్లామర్ షో చేస్తూ ఫోజులిచ్చిన ఫోటోలను కూడా ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సురేఖా వాణి తన కూతురు సుప్రీత కోసం లగ్జరీ కారును కొన్నారు. ఎంజీ కంపెనీకి చెందిన కాస్ట్ లీ కారును సురేఖా వాణి కొనుగోలు చేసింది. ఎంజీ కారు డెలవరీ తీసుకునే సమయంలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది.

సురేఖ వాణి చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు. అలాగే ఈమెకు ఇతర బిజినెస్ లు కూడా లేవు. అయినా, ఇంత కాస్ట్ లీ కారును ఎలా కొనుగోలు చేసింది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా ? లేదా సురేఖనే సొంతంగానే ఇంత కాస్ట్ లీ కారును కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, సురేఖ దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉందని, ఆ మాత్రం డబ్బులు ఆమె వద్ద ఉండవా ? అని మరి కొంత మంది అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు