Vetrimaran : సినిమా ట్రైలర్ “విడుదల”

సమాజంలోని అణచివేత, సమానత్వం, విద్య, లాంటి సున్నితమైన విషయాలను కథా వస్తువుగా ఎంచుకొని సినిమాలు తీసే డైరెక్టర్ ఎవరైన ఉన్నారు అంటే అది వెట్రిమారన్ ఒక్కడే. సాధారణంగా మాట్లాడటానికి ఇష్టపడని మాటలు కూడా ఈయన సినిమాలలో మనకి వినిపిస్తాయి. చూడటానికి కూడా ఇబ్బందిగా ఉండే సన్నివేశాలు ఈయన సినిమాల్లో మనకి కనిపిస్తాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా ఈయన సినిమాలకి దేశమంతా అభిమానులు ఉన్నారు.

అయితే ఆయన రీసెంట్ గా  ఈ డైరెక్ట్ చేసిన మూవీ “విడుతలై” ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో కూడా రిలీజ్ కి సిద్దమయింది. తెలుగులో ఈ సినిమాని “విడుదల” అనే పేరుతో ఏప్రిల్ 15న గీత ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తున్నారు.

బి.జయమోహన్ రాసిన “తుణైవన్” అనే షాట్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు వెట్రిమారన్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు.పలు సినిమాల్లో కమెడియన్ గా సుపరిచితుడైన సూరి ఈ సినిమాలో హీరోగా నటించారు. రెండు పార్ట్ లుగా, తీసిన ఈ మూవీ,  మొదటి పార్ట్ ఈ నెల 15న విడుదల కి సిద్ధమైంది.

- Advertisement -

అయితే “విడుదల” సినిమా కి సంబందించిన తెలుగు ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. “మనిషి పుట్టగానే ఒకరు పైన, ఒకరు కింద, ,మరొకరు ఇంకా కింద అని వేరు చేసే మీరు వేర్పాటు వాదుల లేక అందరు సమానం అని చెప్పే మేము వేర్పాటు వాదులమా ?” అని విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ వెట్రిమారన్ మార్క్ ని తెలియజేస్తున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు