Siddhu Jonnalagadda : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన సిద్దు… డీజే టిల్లు కిక్ అలాంటిది మరి

Siddhu Jonnalagadda :  “డిజె టిల్లు” మూవీతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ సినిమా తర్వాత ఈ హీరో ఒరిజినల్ పేరు కంటే టిల్లు అనే పేరుతోనే బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా యూత్ నుంచి మంచి క్రేజ్ దక్కింది. అప్పటిదాకా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన సిద్దు డీజే టిల్లు మూవీతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ యంగ్ సెన్సేషనల్ హీరో తాజాగా తన రెమ్యూనరేషన్ ను పెంచినట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే…

రెమ్యూనరేషన్ పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ…

2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో వరుస అవకాశాలు అందుకుంటున్న సిద్ధూ తన పారితోషకాన్ని భారీగా పెంచేసాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల పారితోషకం అందుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దు. పనిలో పనిగా పారితోషికం కూడా పెంచేశారు. తాజాగా ఈ హీరో డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ నడుస్తోంది.

టిల్లు స్క్వేర్ కు ఇన్ని అడ్డంకులు…

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన సీక్వెల్ టిల్లు స్క్వేర్. ఈ మూవీ రిలీజ్ కి ముందు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అంచనాలు హైలో ఉన్నప్పటికీ టిల్లు స్క్వేర్ అనేక అడ్డంకులను ఎదుర్కొక తప్పలేదు. ఈ మూవీ మొదలైన కొత్తలోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మల్లిక్ రామ్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. హీరోయిన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ముందుగా ఈ మూవీకి శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవటంతో అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్.

- Advertisement -

ఇక ఈ మూవీని 2023 వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆగస్టుకి వాయిదా పడింది. అప్పుడు కూడా పలు కారణాల వల్ల వాయిదా పడి అక్టోబర్ 6న రిలీజ్ కు రెడీ అయింది. మళ్లీ వాయిదా పడి, ఈ ఏడాది ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ రాబోతున్నాడు అంటూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఈగల్ కారణంగా మళ్లీ పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఇలాగైతే కష్టం అనుకుని ఫిబ్రవరి నుంచి ఏకంగా మార్చి 29కి మూవీ రిలీజ్ డేట్ లో మార్చారు. ఇన్ని అడ్డంకులను దాటుకొని ఈరోజు థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ కూడా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ మరింతగా పెంచే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు