Dhamaka: వంద మిల్లియన్లు కొట్టిన శ్రీ లీల ఫేమస్ సాంగ్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస ఆఫర్లతో బిజీగా మారింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ మొదటి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు అనర్గళంగా మాట్లాడగల ఈ హీరోయిన్ ముందుగా కన్నడ ఇండస్ట్రీలో పరిచయమైనా మంచి క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగులోనే. పెళ్లి సందడి తర్వాత శ్రీ లీల రవితేజ సరసన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి శ్రీ లీల కు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చింది. అయితే ధమాకా సినిమా లోని ఓ పాట తాజాగా యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసింది.

ధమాకా సినిమాలోని జింతాక్ పాట మూవీ రిలీజ్ కి ముందే ఎంతఫేమస్ అయిందో తెలిసిందే. మంగ్లీ పాడిన ఈ పాట డప్పు సౌండ్ తో మంచి మాస్ సాంగ్ గా ఆడియన్స్ ని అలరించింది. ఇక ఈ పాట ద్వారా రవితేజ కన్నా శ్రీ లీల కే ఎక్కువ పేరొచ్చింది. తన డాన్స్ లతో ఈ పాటలో మెస్మరైజ్ చేసింది శ్రీ లీల. తెలుగులో డాన్స్ బాగా చేసే హీరోయిన్ల లో తాను అందరికంటే ముందు ఉంటానని ఈ పాట ద్వారా హింట్ ఇచ్చింది. ఇక ఈ పాట తాజాగా యూట్యూబ్ లో విడుదలై 100 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ పాట యూట్యూబ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయింది.

ఇక శ్రీ లీల ప్రస్తుతం అరడజను తెలుగు సినిమాలతో బిజీ బిజీ గా ఉంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు SSMB 28, రామ్ పోతినేని తో ఒక సినిమా, నితిన్ తో మరో సినిమా ఇంకా మూడు సినిమాలు చేస్తుంది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు