Ram Charan: రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు..!!

Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్.. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవడం అంటే నిజంగా ఆశ్చర్యకర విషయం అని చెప్పాలి. మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. 2007లో సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డెబ్యూ హీరోలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగా రామ్ చరణ్ పేరు సంపాదించారు.

Ram Charan:Ram Charan rejected movies..!
Ram Charan:Ram Charan rejected movies..!

రామ్ చరణ్ రెండవ సినిమానే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించి ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగ రాశారు. ఆ వెంటనే ఆరెంజ్ సినిమాలో నటించి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు.. కానీ ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలా స్పెషల్ గా ఉంటాయి. అయితే రామ్ చరణ్ కెరియర్ లో రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా ఒకసారి మనం చూద్దాం

1). సూర్య సన్నాఫ్ కృష్ణ:
డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ క్లాసికల్ హిట్ అనే చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రామ్ చరణ్ కి రాగా మగధీర సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత వదులుకున్నారు.

- Advertisement -

2). డార్లింగ్:
ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఈ సినిమా స్టోరీ మొదట రామ్ చరణ్ వద్దకు వెళ్లిందట. రామ్ చరణ్ కూడా ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత ప్రభాస్ కే ఈ సినిమా సెట్ అవుతుందని సూచించారట .

3). శ్రీమంతుడు:
ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ వంటి హీరోలు కూడా ఈ కథ విన్నప్పటికీ కొరటాల శివతో రిస్క్ అని చెప్పి నో చెప్పారట. చివరికి మహేష్ చేయడంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

4). ఎటో వెళ్లిపోయింది మనసు:
రామ్ చరణ్ కు ఈ కథను గౌతమ్ వినిపించారట.. కానీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.

5). మనం:
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కినేని కుటుంబానికి ఒక క్లాసికల్ హిట్ మూవీ. ఈ సినిమాని మొదట చరణ్ తో పాటు కొంతమంది హీరోలతో అనుకున్నప్పటికీ చివరికి అక్కినేని కుటుంబంతో చేశారట.

6). కృష్ణం వందే జగద్గురుమ్:
క్రిష్ చరణ్ మంచి స్నేహితుల అన్న విషయం తెలిసింది మొదట ఈ సినిమా కథను వెంకటేష్ కు వినిపించాడు ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేశారు కానీ వెంకటేష్ చేయలేకపోయారు ఆ తర్వాత చరణ్ కూడా సంప్రదించారు క్రిష్ కానీ చివరికి రానా ఫైనల్ అవ్వడం జరిగింది.

7).కృష్ణార్జున యుద్ధం:
నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు మొదట ఈ సినిమా కథ రాంచరణ్ వద్దకు వెళ్ళింది కానీ ఆయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది..

8). ఓకే బంగారం:
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేశారు మరి ఇంత క్లాస్ సినిమాలో రాంచరణ్ ఊహించుకోవడం కష్టమే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు