Anasuya: @16 లోనే అతడితో డేటింగ్.. ఈ కోణం కూడా వుందా అనూ..!

Anasuya.. బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకొని తన నటనతో, ప్రతిభతో ఎంతోమంది అభిమానులను చూరగొన్న అందాల తార అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందంతో వాక్చాతుర్యంతో ఎటువంటి వారినైనా సరే మంత్రముగ్ధులను చేసే ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ లో దాదాపు దశాబ్ద కాలం పాటు యాంకర్ గా పనిచేసి.. ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించడమే కాదు జబర్దస్త్ షో టీఆర్పి రేటింగ్ పెరగడానికి కూడా కారణం అయ్యింది.. అంతలా తన ప్రతిభతో షోని విజయవంతం చేసింది అనసూయ.. ఇక తర్వాత కాలంలో సినిమాలలో అవకాశాలు రావడంతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. అందులో భాగంగానే వెండితెరపై ఈమె చేసిన కొన్ని పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ఉదాహరణకు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ఈమెకు ఎంతగా పేరు తెచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రకి కూడా అంతే పేరు లభించిందని చెప్పవచ్చు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ ఉంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Anasuya: Anasuya dating starts at her age of 16.. !
Anasuya: Anasuya dating starts at her age of 16.. !

16వ యేటనే ప్రేమలో పడిన అనసూయ..

ఇకపోతే అనసూయది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సాక్షి ఛానల్ యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టినప్పుడు అనసూయ వయసు 16 సంవత్సరాలు.. అప్పటికే ఆమె డేటింగ్ లో ఉన్నట్టు తెలిపింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో అప్పట్లోనే ప్రేమలో ఉన్న ఈమె తన లవ్ స్టోరీ యొక్క సీక్రెట్ ను కాస్త రివీల్ చేసింది అనసూయ.

- Advertisement -

అనసూయ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి దానిని ఎంజాయ్ చేయాలి.. దాని కోసం ప్రత్యేకించి ప్లాన్ లు , లెక్కలు ఉండకూడదు.. ముందుకు వెళుతున్నానా..? వెనక్కి వెళ్తున్నానా? అని మాత్రమే నేను ఆలోచిస్తాను.. ఇప్పటికీ నేను సాక్షిలో వార్తలు ఎలా చదివానా ?అని చూసుకుంటూ ఉంటా.. ఇక నేను సాక్షిలో పనిచేస్తున్నప్పుడు నా వయసు పదహారేళ్లు.. నా బాయ్ ఫ్రెండ్ కి 19 ఏళ్ళు.. మా సీక్రెట్ రిలేషన్ చాలామందికి తెలియదు.. కానీ సాక్షి వాళ్లకు మాత్రం తెలుసు.. ఆ సమయంలో చాలా డిప్రెషన్ లో ఉండే దాన్ని.. పెళ్లి సమయం నుంచి చాలా ట్రబుల్స్ ఎదుర్కొన్నాను. నేను సౌత్.. తను బీహార్.. ఎవరి ఇంట్లోనైనా ఉండేదే.. కానీ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నందుకు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు.. నేను పద్ధతి గల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను.. దుపట్టాకి గంజి పెట్టి మరీ ఇలా ఒంటిపై కప్పేది మా అమ్మ.. ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు నేను ఇలా పెరగలేదు కదా అని మాత్రం అనిపించదు.. ఎందుకంటే మా ఆయనతో డేటింగ్ మొదలైన తర్వాత నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.. నేను హైదరాబాదులో పుట్టి పెరిగినా.. నాకు బిర్లా మందిర్ చూపించింది మాత్రం మా ఆయనే.. మా అమ్మ, భర్త, అత్త,మామల్ని కూడా ఆడియో ఈవెంట్లకి తీసుకొని వచ్చే దానిని.. నా ధర్మంలో నేను ఉండేదాన్ని.. ఎవరో ఏదో అనుకుంటారని.. నేను వాళ్ళలా ఆలోచించలేదు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి తన 16 వ యేటనే తన భర్తతో డేటింగ్ లో ఉన్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.ఈ విషయం తెలిసి పద్ధతి గల నీలో అప్పట్లోనే ఈ కోణం కూడా వుందా అనూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు