Maidaan : టాక్ ఫుల్.. జనాలు నిల్.. అందుకే ఈ నిర్ణయం..

Maidaan : బాలీవుడ్ లో ఈ రంజాన్ కానుకగా భారీ సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీ స్టారర్ బడే మియా చోటే మియా ఒకటి కాగా, మరొకటి అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ మూవీ. అయితే ఇందులో బడే మియా చోటే మియా కమర్షియల్ మూవీగా తెరకెక్కగా, రొటీన్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక అజయ్ దేవగన్ నటించిన సినిమా మైదాన్ కి రిలీజ్ కి ముందు నుండే పాజిటివ్ బజ్ ఉండగా, థియేటర్లలో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా జనరల్ గా కొన్ని సినిమాలకు విమర్శకులు అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తారు. ప్రీమియర్ షోలకే చాలా మంచి సినిమా అందరూ చూడాలి అంటూ అభినందనలు వెల్లువెత్తుతాయి. తీరా చూస్తే కామన్ ఆడియన్స్ నుండి మాత్రం ఆశించిన ఆదరణ ఉండదు. రీసెంట్ గా రెండు వారాల కింద వచ్చిన ‘ది గోట్ లైఫ్’ సినిమాకి మళయాళంలో మంచి ఆదరణ దక్కితే తెలుగు, తమిళ్ సహా ఇతర భాషల్లో కనీసం ఓ వర్గం జనాలు కూడా పట్టించుకోలేదు. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మైదాన్ మూవీ పరిస్థితి ఇలాగే తయారయింది.

మైదాన్ కి ప్రేక్షకాదరణ కరువు..

రంజాన్ కానుకగా రిలీజ్ అయిన ‘మైదాన్'(Maidaan) సినిమా ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. 1950 ప్రాంతంలో భారతదేశపు ఫుల్ బాల్ ఆటకు జీవం పోసిన సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీకి బాలీవుడ్ క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. కానీ థియేటర్ల వద్ద మాత్రం ఆశించిన స్పందన రావడం లేదు. దానికి ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ని బట్టే తెలుస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజు మైదాన్ దేశవ్యాప్తంగా కేవలం 7 కోట్ల 25 లక్షలు మాత్రమే రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 10. 75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైనట్టు ట్రేడ్ పండితుల రిపోర్ట్. నిజానికి అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోకు వచ్చే వసూళ్లు కావివి. అయితే రొట్ట సినిమా అని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘బడేమియా చోటేమియా’ కి మాత్రం దీనికంటే మంచి వసూళ్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ బయ్యర్లు మైదాన్ కొచ్చిన పాజిటివ్ టాక్ చూసి దంగల్, ‘చెక్ దే ఇండియా’ రేంజ్ లో బాగా ఆడేస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు.

ప్రేక్షకాదరణ కోసం విశ్వ ప్రయత్నాలు?

అయితే రంజాన్ సెలవు రోజున రిలీజ్ అయినా కూడా ఇంత తక్కువ వసూళ్లు వస్తాయని మేకర్స్ ఊహించలేదు. అప్పట్లో రంజాన్ కి వచ్చే సల్మాన్ ఖాన్ సినిమాలకు ప్రతిసారి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు కురిసేవి. అలాంటిది మైదాన్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఇలాంటి వసూళ్లు రావడం మేకర్స్ ఊహించి ఉండరు. అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రావడం వల్ల ఈ సినిమాను లైట్ తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మైదాన్ సినిమా కోసం జనాలని థియేటర్లకు రప్పించడానికి మేకర్స్ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైదాన్ సినిమాకు ‘బై వన్ గెట్ వన్’ టికెట్ ఆఫర్ ని కూడా పెట్టడం జరిగింది. పైగా చిత్ర యూనిట్ ప్రధాన నగరాల్లో నటీనటులతో సహా వెళ్లి ప్రమోట్ చేస్తున్నారు. ఇక కొంతమంది నెటిజన్ల అభిప్రాయం ప్రకారం దీనికి పోటీగా వచ్చిన బడే మియా చోటే మియా డిజాస్టర్ అయింది కనుక, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని, లాస్ట్ టైం వచ్చిన అజయ్ దేవగన్ సైతాన్ సినిమా ఎలా పికప్ అయిందో అలాగే ఈ సినిమా కూడా పికప్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి మైదాన్ వీకెండ్ లో ఎలా పుంజుకుంటుందో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు