Prashanth neel : ఆయనే నా అభిమాన దర్శకుడు – ప్రశాంత్ నీల్

ప్రస్తుతం ఇండియా లో ఉన్న పాన్ ఇండియా స్టార్ దర్శకుల్లో ఒకరు ప్రశాంత్ నీల్. తీసింది నాలుగు సినిమాలే అయినా, ఆ సినిమాలతోనే తన కంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను ఈ విధంగానే సినిమాలు తీస్తానని చెప్పి మరీ హిట్లు కొట్టగల సత్తా ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కెజిఎఫ్ తో పాన్ ఇండియా వైడ్ గా ప్రకంపనలు సృష్టించి హీరో యష్ ఎంత పేరు సంపాదించాడో, అంతే పేరు ప్రశాంత్ నీల్ దక్కించుకున్నాడు. ఇక రీసెంట్ గా సలార్ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా తన మార్క్ ఎలివేషన్లతో, టేకింగ్ తో హిట్ అయ్యేలా చేసాడు. ప్రస్తుతం సలార్ 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఒకవేళ ప్రభాస్ కల్కి2898AD , రాజా సాబ్ సినిమాలు రిలీజ్ అయ్యాకే మొదలు పెడతా అంటే, ఆ లోపు ఎన్టీఆర్ తో సినిమా తీసే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తాజాగా కన్నడలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ తన ఫేవరేట్ దర్శకుడు ఎవరూ అని అడిగితే ప్రశాంత్ నీల్ చెప్పిన ఆ పేరు సెన్సేషనల్ గా మారింది. ఇంతకీ ప్రశాంత్ నీల్ అభిమాన దర్శకుడు ఎవరో కాదు విలక్షణ దర్శకనటుడు అయిన “ఉపేంద్ర”. అవును.. ప్రశాంత్ నీల్ అల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ ఉపేంద్ర అని ఆ షో లో చెప్పుకొచ్చాడు. అయితే ప్రశాంత్ నీల్ ఉపేంద్ర దర్శకత్వం గురించి ప్రస్తావిస్తూ ఇండియా లోనే కాదు తనకి ఇంటర్నెషనల్ వైడ్ గా అయినా ఉపేంద్ర మాత్రమే ఇష్టమైన దర్శకుడని వ్యాఖ్యానించాడు. పైగా ఇది కన్నడ షో అని నేను ఆయన పేరు చెప్పట్లేదు, ఏ షో కి వెళ్లినా ఆయనే నా ఫేవరేట్ దర్శకుడని చెప్తాను అని అన్నాడు.

అయితే ఉపేంద్ర దర్శకత్వం లో ఉన్నంత క్రియేటివిటీ గాని, రియాల్టీ గాని తాను ఏ డైరెక్టర్ లో కూడా చూడలేనని అన్నాడు. ముఖ్యంగా ఆయనలా నిజాలు చూపించే గట్స్ ఏ డైరెక్టర్ కీ లేవని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర చాలా రోజుల తర్వాత మళ్ళీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ UI సినిమా తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఒక సాంగ్ ప్రోమో సోషల్ మీడియా లో ఎంత ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఫుల్ సాంగ్ మార్చి 4న రిలీజ్ కానుంది. అలాగే ఇతర హీరోల సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు