Kona venkat : ఫైనల్ గా గీతాంజలి2 వాయిదా? కొత్త రిలీజ్ డేట్ ప్రకటనతో..!

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా లేటెస్ట్ గా “గీతాంజలి” మళ్ళీ వచ్చింది” అనే సినిమాలో నటించిందన్న విషయం తెలిసిందే. అంజలి ఇంతకు ముందు నటించిన గీతాంజలి అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని కోన వెంకట్ నిర్మిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ తాజాగా ప్రకటించడం జరిగింది. సినిమా టీజర్ వచ్చినప్పుడే గీతాంజలి 2 వాయిదా పడుతుందని మేకర్స్ అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, టీజర్ ని కూడా చిన్న గ్యాప్ తోనే రిలీజ్ చేసారు. అయితే టీజర్ రిలీజ్ చేసిన నాలుగు వారాల్లోపే సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్లపై చాలా ఫోకస్ పెట్టాలి. కానీ మూవీ పై టీజర్ రిలీజ్ అయ్యాక ఇప్పటివరకూ సరైన బజ్ క్రియేట్ అవలేదు. అలా కావాలంటే చిత్ర యూనిట్ బాగా టైం తీసుకుంటే మంచిది. అదీ గాక మార్చి 22న అదే రోజు శ్రీ విష్ణు నటించిన ఓం భీం బుష్ సినిమా కూడా అదే రోజు వస్తుంది కాబట్టి, అది కామెడీ జోనర్ మూవీ కాబట్టి ఆ సినిమా వైపే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది.

అందువల్ల ఈ సినిమాను వాయిదా వేయడమే మంచిదని నెటిజన్లు కూడా భావిస్తున్నారు. ఇక అంజలి 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వాయిదా వేశామని ప్రకటిస్తూనే కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ గా నటించగా, సునీల్, అలీ, రవి శంకర్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, బ్రహ్మాజీ, రాహుల్ మాధవ్ కీలకపాత్రల్లో నటించారు. అంజలి ఈ సినిమాతో మళ్ళీ ఫిమేల్ లీడ్ గా సూపర్ హిట్ కొట్టి, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ ఆసక్తిగా ఉంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు