Teri BaatonMein Aisa Uljha Jiya : డిజాస్టర్ టాక్ తో వంద కోట్లు..!

బాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సినిమాల ప్రభావం ఇంకా మొదలవ్వలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ క్రమంలో కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాగా ఆడుతున్నాయి. అయితే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కంటెంట్ బాగుంటే ఎవ్వరైనా చూస్తారు. అది మ్యాటర్ కాదు. కానీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎంత బ్యాడ్ టాక్ తెచ్చుకున్నా బాలీవుడ్ జనాలు అప్పుడప్పుడూ హిట్లు మూటజెప్పుతారు. రీసెంట్ గా బాలీవుడ్ ఫైటర్ మూవీ అస్సలు బాగాలేదని కామెంట్స్ వినిపించినా దానికి 300 కోట్లు కలెక్షన్లు ఇచ్చారు ప్రేక్షకులు. అలాగే లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా థియేటర్ల దగ్గర ఆడియన్స్ చూడ్డానికి ఇంట్రస్ట్ చూపించారు. అంతే కాదు మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెంచుకుంటూ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఆ సినిమాయే షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా “తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా” (Teri Baaton Mein Aisa Uljha Jiya). ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఒక రోబోట్ ని పెళ్లి చేసుకునే అబ్బాయి లైఫ్ అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ కామెడీ సినిమా క్రిటిక్స్ నుండి చెత్త సినిమా అన్న టాక్ తెచ్చుకుంది. పైగా హాలీవుడ్ లో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే థియేటర్ల దగ్గర 30 కోట్లు కూడా వసూలు చేయదనుకున్న ఈ సినిమా, రివ్యూలకు సంబంధం లేకుండా, కామన్ ఆడియన్స్ థియేటర్ల దగ్గర హిట్ చేసి పడేసారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వాషౌట్ అవుతుంది అనుకున్న సినిమా డిజాస్టర్ రివ్యూలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల క్లబ్ లో చేరి ప్రస్తుతం 130 కోట్ల దగ్గర పరుగుని కొనసాగిస్తోంది. ఇక ఫైనల్ రన్ లో 150 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమా టోటల్ ఇండియా లో 90 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ నుండి 40 కోట్ల వరకు రాబట్టింది. అయితే 110 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేస్తే హిట్ అనిపించుకునే అవకాశం ఉండగా, ఈ సినిమా లాంగ్ రన్ లో 150 కోట్ల అందుకుని సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనా షాహిద్ కపూర్ కి కబీర్ సింగ్ తర్వాత ఓ మోస్తరు హిట్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్ జనాల టేస్ట్ మాత్రం ఒక్కోసారి అర్ధమై చావదు. మంచి కాన్సెప్ట్స్ తో తెరకెక్కిన సినిమాలని ప్లాప్స్ చేస్తూ, పరమ రొటీన్ సినిమాలని హిట్ చేస్తూ ఉంటారు. ఈ తంతు అన్ని ఇండస్ట్రీల్లోనూ జరిగినా, బాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు