Pawan Kalyan : బ్రో మూవీ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో భారీ సెట్

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ యాంటిస్పెటెడ్ మూవీ ” బ్రో “. ఇటివలనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ సినిమా పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి.

తమిళ్ యాక్టర్ కం డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతాం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సక్సెస్ ఫుల్ సినిమాల నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోర్షన్ ఎప్పుడో కంప్లిట్ చేశామని చెప్పిన మూవీ యూనిట్, ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో భారీ స్థాయిలో ఒక పబ్ సెట్ వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో వేయిస్తున్న ఈ సెట్ లో ఒక సాంగ్ అండ్ ఫైట్ ని చిత్రీకరించబోతున్నారని సమాచారం. అలాగే సినిమాలో ఉండే ఒక కీలకమైన సన్నివేశం కూడా ఇందులోనే ఉండబోతుందట. అందుకే భారీ బడ్జెట్ తో ఈ సెట్ వేయడానికి ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నారంట. వచ్చే జులై 28న సినిమా రిలీజ్ అవబోతుండటంతో సినిమాకి సంబందించిన పనులు వేగవంతం అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాల షూటింగ్ లలో బిజీ ఉంటుండటంతో ఈ సినిమాని షూటింగ్ ని వీలైనంత తొందరగా ఫినిష్ చేయడానికి చూస్తున్నారు. ఇటీవలనే సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా రిలీజ్ ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కి కొద్దిరోజులు బ్రేక్ పడింది. అయితే ఈ సెట్ పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు