Gopichandh :డింపుల్ హయతి రిలాక్స్ మోడ్ ఆన్

ఈ మధ్య తెలుగులో ట్రేండింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న డింపుల్ హయతి ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ మెరిసిన ఈ భామ ఆ సాంగ్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

అయితే డింపుల్ హయతి తెలుగమ్మాయే అయిన ఆమె పేరులోనే బాలీవుడ్ ఫ్లేవర్ ఉండటంతో ఎవరు ఈమెని మొదట్లో తెలుగమ్మాయి అనుకోలేదు. అందుకే చెప్పుకోదగ్గ అవకాశాలు కూడా రాలేదు. వచ్చిన ఒకటి, రెండు అవకాశాలు కూడా ఆమెకి పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత చాలా రోజులకి గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ కి ఈ బ్యూటీ ఓకె చెప్పడంతో ఆ అమ్మాడుకి అవకాశాలు రావడం మొదలయ్యాయి.

గద్దలకొండ గణేష్ సినిమా తరువాత డింపుల్ హయతి రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో కెరీర్ మొదలయినట్టే, అయ్యి బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా ఈమె గోపీచంద్ హీరోగా వచ్చిన రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. లక్ష్యం, లౌక్యం సినిమాలతో గోపిచంద్ కి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, హ్యటిక్ కొడతారేమో అనుకున్న ఈ కాంబినేషన్, రొటీన్ స్టోరీ వాళ్ళ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. హిట్స్ ఉంటేనే సరిగా పట్టించుకోని సినీ పరిశ్రమలో అసలే హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో డింపుల్ హయతికి అవకాశాలు కరువయ్యాయి. దాంతో రిలాక్స్ మోడ్ కి వెళ్లిన డింపుల్ హయతి ఇంట్లో కూర్చొని.. తన కుక్కపిల్లతో ఆడుకుంటూ, ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు