Chakda Xpress: ఈ స్టార్ హీరోయిన్ కి సినిమాలపై ఆసక్తి లేదా ?

అనుష్క శర్మ.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008 లో “రబ్ నే బనా ది జోడి” తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇండస్ట్రీ మొత్తం తన వైపునకు తిప్పుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాండ్ బాజా బారత్, జబ్ తక్ హై జాన్, pk వంటి సినిమాలతో నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. కథకు అవసరమైతే తప్ప ఎక్స్ పోసింగ్ కు చాలా దూరంగా ఉంటుంది అనుష్క. బాంబే వెల్వెట్, సుల్తాన్, సంజు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయ్యింది.

అయితే 2017 లో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని ప్రేమ వివాహం చేసుకున్న అనుష్క తర్వాత సినిమాలు చేయడం మెల్లిగా తగ్గించింది. చివరగా 2018లో షారుఖ్ ఖాన్ నటించిన “జీరో” మూవీలో హీరోయిన్ గా నటించిన అనుష్క ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి పరిమితమైపోయింది. ఈ గ్యాప్ లో తాను ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కెరీర్ పీక్స్ దశలో ఉండగానే పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ ఇప్పుడు సినిమాల్లో కంటిన్యూ అవుతుందంటే డౌటే అనే చెప్పాలి. ఎందుకంటే తనకు ఇప్పుడు కూతురు కూడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ నటించాలంటే కష్టమే.

అయితే పెళ్లి తర్వాత అనుష్క ఓ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వగా, మరో సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో అనుష్క శర్మ మెయిన్ లీడ్ గా “చక్దా ఎక్సప్రెస్” అనే సినిమా చేస్తుంది. 2023 లోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే దీని తర్వాత అనుష్క ఏ సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. మరి అనుష్క శర్మకు సినిమాలపై ఆసక్తి తక్కిందా? లేదా మంచి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తుందా? ఇవి రెండు గాక ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అవ్వాలని అనుకుంటుందా అనేది తెలియాలంటే అనుష్క శర్మే స్వయంగా చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు