NTR100Years: ఎన్టీఆర్ 100ఇయర్స్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ రామ్ చరణ్

నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక మే 20న సాయంత్రం హైదరాబాద్ లోని KPHB లోని ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుక నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నందమూరి అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ 100ఇయర్స్ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు నాగ చైతన్య, సుమంత్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, మురళి మోహన్, ఆర్. నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక అలనాటి హీరోయిన్లు జయసుధ, జయప్రద, ప్రభ, మేనక కూడా ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. టాలీవుడ్ లో అందరు టాప్ హీరోలకు ఆహ్వానం వెళ్లినా పలు కారణాల వల్ల వారు ఈ వేడుకకు రాలేదు. టాప్ హీరోల్లో ఒక్క రామ్ చరణ్ మాత్రం ఈ వేడుకకు రావడంతో అందరి చూపు చరణ్ పైనే పడింది. ఈ వేడుకకి చాలా సింపుల్ గా వచ్చిన రామ్ చరణ్ తన స్పీచ్ తో మాత్రం అదరగొట్టేశాడు.

మామూలుగా అచ్చ తెలుగులో ఎక్కువగా మాట్లాడని రామ్ చరణ్ ఈ వేడుకలో ఐదు నిమిషాల పాటు తన స్పీచ్ తో స్టేజి పైన ఉన్నవారితో పాటు నందమూరి అభిమానులను కూడా మంత్రముగ్దుల్ని చేసాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ ముందుగా ఈ ఫంక్షన్ కి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ కి ధన్యవాదాలు తెలిపాడు. ఇక స్టేజి పై ఉన్న ప్రతి ఒక్క సినీ, రాజకీయ ప్రముఖులకు పేరు, పేరునా థ్యాంక్స్ చెప్పాడు. చరణ్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ బతికున్నంత వరకు ఎన్టీఆర్ గారు బ్రతికే ఉంటారు, తాము ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దేశంలో పాపులర్ అయ్యాము. కానీ అప్పట్లోనే తన సినిమాలతో పాటు, రాజకీయనాయకుడిగా దేశం మొత్తం తెలుగునేల వైపు చూసేలా ఎన్టీఆర్ చేశారన్నారు.

- Advertisement -

ఇక సీనియర్ ఎన్టీఆర్ తో తన మొదటి పరిచయాన్ని గురించి చెప్తూ ఎన్టీఆర్ కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి అబ్బాయి ద్వారా అయ్యానని కలిశానని, ఫస్ట్ మీట్ లోనే ఆయన తో భోజనం చేసే అవకాశం వచ్చిందని, ఆ సందర్భం ఎప్పటికి మరిచిపోలేనని అన్నాడు. ఇక ఎన్టీఆర్ పని చేసిన ఇండస్ట్రీ లో తాను కూడా పనిచేస్తునందుకు చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి నందమూరి తారకరామారావు గురించి ఇంత బాగా మాట్లాడినందుకు నందమూరి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు