RRR : అంత‌ర్జాతీయ రేస్ లోకి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘RRR’ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక ఈసినిమాలో న‌టించిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. భార‌తీయ సినిమా ప్రేమికుల‌కు, ప్రేక్ష‌కుల‌కు అంద‌రికీ ఇది శుభ‌వార్త‌నే. ఎందుకు అంటే ఇప్పుడు ‘RRR’ సినిమాలో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల పేరు ఆస్కార్ రేసులో ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

ఇక RRR సినిమా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘NETFLIX’ లో ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉండి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో పాటు కొద్ది రోజుల కింద‌టే ఈ చిత్రంలో న‌టించిన ఎన్టీఆర్‌కి ఆస్కార్ అవార్డు వ‌స్తుందని ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన వెరైటీ మ్యాగ‌జైన్ ప్ర‌స్తావించింది. ఇక తాజాగా వెరైటీ మ్యాగ‌జైన్ ‘RRR’ సినిమాని నామినేట్ చేసింది. తాజాగా మ‌రోసారి ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు,  బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ దోస్తికి, బెస్ట్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌మౌళికి ఆస్కార్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తూ ఈ జాబితాని విడుద‌ల చేసింది.

రాజ‌మౌళి రూపొందించిన ‘RRR’ మూవీలో కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించారు. వీరి న‌ట‌న భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే కాదు.. హాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌ను సైతం మెప్పించింది. ప్ర‌ధానంగా పెద్ద‌పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్‌, ఇంట‌ర్వెల్ సీన్ చాలా అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించార‌ని వీరి న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హాలీవుడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు