Hit-2: డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో ఇన్వెస్టికేషన్ థ్రిల్లర్ గా తెరికెక్కిన “హిట్” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో విశ్వక్సేన్ నటించిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. కాగా డైరెక్టర్ శైలేష్ 2021లో ఈ సినిమాకు సీక్వెల్ హిట్.. ది సెకండ్ కేస్ (HIT 2) ని ప్రకటించాడు. అయితే మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ కాకుండా ఈ ఫ్రాంచైజ్ మూవీలో అడవి శేషు నటిస్తున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను ” హిట్ 2″ ని సూపర్ హిట్ చేయాలనే తపనతో స్క్రిప్ట్ ను తయారు చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండడం విశేషం.

ఈ చిత్రాన్ని ప్రశాంతి టిపిర్నే నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అడవి శేష్ సరసన కథానాయికగా మీనాక్షి చౌదరి అలరించనుంది. రావు రమేష్, భానుచందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 2న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. కొత్త పోస్టర్ విడుదల చేస్తూ విడుదల తేదీని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు నాని. ఇక మేజర్ తర్వాత అడవి శేషు నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు