Kaarthi: సర్ధార్ అప్డేట్

తమిళ్ హీరో కార్తీ.. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కార్తీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రతి సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తూ ఉంటాడు. కార్తీ ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అందుకే అతను టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టపడతాడు. కార్తీ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ” సర్దార్” స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ” అభిమన్యుడు” ఫేమ్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సిమ్రాన్, రజీష్ విజయన్, మనీష్ కాంత్, చంకీ పాండే, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తూ ఉండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ మూవీ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా ఈ మూవీ ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు