Samantha : వెనక్కి

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌ల‌లో స‌మంత ఒక‌రు అని చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో స‌మంత సినిమాల‌తో పుల్ బిజీగా గ‌డుపుతోంది. ముఖ్యంగా భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత వ‌ర‌స సినిమాల‌ను చేస్తోంది. అందులో కొన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఉండ‌డం విశేషం. అయితే స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండతో ఒక సినిమాలో న‌టిస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-స‌మంత జంట‌గా ఖుషీ సినిమాలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్తి అయింద‌ట‌. కేవ‌లం 30 రోజుల షూటింగ్ బాలెన్స్ ఉంది. ఇదిలా సమంత స్కిన్ ప్రాబ్లమ్ మీద రకరకాల గాసిప్ లు వినిపిస్తున్నాయి. కొన్ని మందులు పడకపోవడం వల్లనే ఆమె స్కిన్ రాష్ సమస్య వచ్చిందని.. ప్రస్తుతం ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ విషయాన్ని సమంత మాత్రం అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. ఖండించ‌నూ లేదు. స‌మంత ప్ర‌స్తుతం సైలెంట్‌గానే ఉంది.

నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స‌మంత ప్ర‌స్తుతం సైలెంట్‌గానే ఉంది. య‌శోద టీజ‌ర్‌కి సంబంధించి త‌ప్ప ఆమె మ‌రో పోస్ట్ లేదు. ఇది ఇలా ఉండ‌గా.. స‌మంత రాక‌పోవ‌డం వ‌ల్ల ఖుషి సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 23న విడుద‌ల అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా నెల రోజుల‌కు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండ‌డంతో అక్టోబ‌ర్‌లో స‌మంత షూటింగ్‌కి హాజ‌రు అయితే మాత్రం అనుకున్న విడుద‌ల‌య్యే ఛాన్స్ ఉంటుంది.

- Advertisement -

మ‌రోవైపు ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో విడుద‌లయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఖుషి సినిమా ప‌క్కా సాప్ట్ స‌బ్జెక్ట్ కావ‌డంతో ఫైట్లు ఏమి ఉండ‌వు. హిందీ రైట్స్‌ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందువ‌ల్ల స‌మంత న‌టించిన ఖుషి మాత్రం డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం త‌క్కువే అని స‌మాచారం. ఈ విష‌యం స‌మంత ఓ క్లారిటీ ఇస్తే అస‌లు విష‌యం తేల‌నుంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు