Tollywood: ఇప్పుడిదే క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ సినిమా

పొరుగింటి పుల్లకూర రుచి అనేది సామెత, అదే సామెత ఇప్పుడు నార్త్  సినీ పరిశ్రమకు వర్తిస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మిగతా ఇండస్ట్రీలకు చిన్న చూపు, వాళ్ల అభిప్రాయాలకు తగినట్లుగానే తెలుగులో రిలీజయ్యే  సినిమాలు కూడా అలానే ఉండేవి, కొడితే కాలువగట్లు కూలిపోవడాలు , నరికితే తాటిచెట్లు పడిపోవడాలు, లేకి కామెడీ ఇది ఒకప్పుడు తెలుగు సినిమా ఫార్ములా.

చాలామంది అభిప్రాయాలకి చెక్ పెడుతూ తెలుగు సినిమాను ఎల్లలు దాటించి శిఖరం పై కూర్చోబెట్టాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఒక్కసారిగా మిగతా ఇండస్ట్రీల కళ్ళన్నీ ఈ ఓటమి ఎరుగని దర్శక ధీరుడు పై పడ్డాయి. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా హిట్ అయి  రాజమౌళి స్థాయిని పెంచింది.అలానే సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా కూడా ఎల్లలు దాటి అద్భుతాలను క్రియేట్ చేసింది. “తగ్గేదేలే” అనే పుష్ప సినిమా డైలాగ్ లాగానే తెలుగు సినిమా ఎక్కడా తగ్గకుండా అంచలంచెలుగా ముందుకు వెళ్తుంది.

ఒకప్పుడు ఒక తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో సినిమా చెయ్యడం అంటే గగనం, రామ్ గోపాల్ వర్మ మినహాయిస్తే ఆ అవకాశం దక్కిన దర్శకులు అరుదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన స్థాయికంటే మన ఆలోచన స్థాయి తక్కువ అనే అపనమ్మకాలు ఉండేవి.

- Advertisement -

అలానే ఒకప్పుడు గొప్ప సినిమాలు, అందమైన లవ్ స్టోరీలు అన్ని బాలీవుడ్ లో వచ్చేవి. ఓటిటి లు లేని రోజుల్లో “దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, లవ్ ఆజకాల్ , ఫనా , లంచ్ బాక్స్ , లగాన్ , బర్ఫీ , తమాషా, షోలే , 3 ఇడియట్స్”  లాంటి సినిమాలు గురించి విని సీడీలు కొనుక్కుని చూసిన రోజులు కూడా ఉన్నాయి.  అంతేకాకుండా రాజ్ కుమార్ హిరానీ తీసిన “మున్నాభాయ్ ఎం.బి.బి.స్” సినిమాను తెలుగు లో “శంకర్ దాదా ఎం.బి.బి.స్” గా రీమేక్ చేస్తే ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు తెలుగు ఆడియన్స్.  “జో జీతా వోహీ సికందర్” సినిమాను బేస్ చేసుకుని తమ్ముడు సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ చేసాము.

కానీ ఇదంతా ఒకప్పుడు , ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు బాలీవుడ్ లో తెలుగువాడి సత్తాను చూపించారు.
ఇప్పుడు ఆ బాలీవుడ్ ప్రేక్షకులకు ఎటువంటి సినిమాలు కావాలో బాలీవుడ్ దర్శకులకే అంతు చిక్కడం లేదు. రీసెంట్ టైమ్స్ అక్కడ స్టార్ హీరోస్ చేస్తున్న ఏ సినిమాకి తగిన ఆదరణ లభించడం లేదు. అప్పట్లో ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన 83 సినిమా బాగున్నా పూర్తి స్థాయిలో కలక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపుగా ఈ మధ్యకాలంలో హిందీలో రిలీజ్ అయినా  సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ” కశ్మీర్ ఫైల్స్”  సినిమా మినహాయిస్తే ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకున్న సినిమా ఒకటి కూడా లేదు.

ప్రస్తుతం సౌత్ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. ప్రభాస్ నటించిన రాధే శ్యాం, యాష్ నటించిన కెజిఫ్ , రాంచరణ్ తారక్ కలిసి చేసిన ట్రిపుల్ ఆర్, అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలు మొదటి రోజే అద్భుతమైన కలక్షన్స్ తీసుకుని వచ్చాయి.ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన బాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు పాగా వేస్తున్నాయి అని చెప్పొచ్చు.

అలానే సౌత్ సినిమా స్థాయి , స్థానం రెండు మారిపోయాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్ కే , అనిమల్ , సలార్ వంటి సినిమాలు కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
టెక్నీకల్ గా కూడా సినిమా  చాలా స్ట్రాంగ్ అయిపోయింది. హైదరాబాద్ ఫిలిం హబ్ గా మారనుంది.  రీసెంట్ గా జరిగిన విఎఫ్ఎక్స్ సమ్మిట్ లో కూడా ఇండియన్ సినిమాకి టాలీవుడ్ క్యాప్టిల్ లా ఉండబోతుందని నాగార్జున చెప్పుకొచ్చారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు