Keedaa Cola Premieres Talk: విషయం వీక్ – పబ్లిసిటీ పీక్స్..!

ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఒక యూనిక్ పర్సనాలిటీ అనటంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి చూపులు సినిమా ద్వారా  చేసిన ఫస్ట్ అటెంప్ట్ తోనే బ్లాక్ బస్టర్ అందుకొని ఇండస్ట్రీ చూపును తన వైపుకి తిప్పుకున్నాడు. సాధారణంగా ఒక మోస్తరు హిట్ పడగానే ఏ డైరెక్టర్ అయినా తమకు తాము తోపులమని ఫీలయ్యి స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు ట్రై చేస్తుంటారు. కానీ, తరుణ్ భాస్కర్ మాత్రం కమర్షియల్ సినిమాల తాలూకు పైత్యం అంటించుకోకుండా రెండో సినిమా కూడా కొత్త వాళ్ళతోనే తీసి హిట్ అందుకున్నాడు.
అయితే, ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వెంకటేష్ హీరోగా తరుణ్ భాస్కర్ సినిమా ఉండనుందని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ, స్క్రిప్ట్ నచ్చకనో ఇంకే కారణమో తెలీదు కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలా తరుణ్ భాస్కర్ మూడేళ్ళుగా మెగాఫోన్ కి దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం కీడా కోలా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు తరుణ్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇటీవల ప్రీమియర్స్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో కీడా కోలా సినిమాకి కూడా పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసింది సినిమా యూనిట్.
ప్రీమియర్స్ వల్ల చాలా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి కానీ, కీడా కోలా సినిమా విషయంలో సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. యూఎస్ లో వేసిన  ప్రీమియర్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బిగినింగ్ టు ది ఎండ్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షా పెట్టిందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో విషయం లేదు కాబట్టే ప్రమోషన్స్ లో అంత హడావిడి చేశారా అని కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేయని తరుణ్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. సినిమాలో మ్యాటర్ లేదని ముందే గ్రహించాడు కాబట్టే హడావిడి చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేసేందుకు ట్రై చేసినట్టున్నాడు. ఈ మాత్రం దానికే జర్నలిస్ట్ ల మీద సెటైర్లు వేయడం కేర్లెస్ కామెంట్స్ చేయటం ఎందుకని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి, కళాఖండం తీసిన లెవెల్లో బిల్డప్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు వస్తున్న నెగిటివ్ టాక్ ని ఏ రకంగా కవర్ చేసుకుంటాడో చూడాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు