Keedaa Cola: తరుణ్ భాస్కర్ కీడా కోలా టైటిల్ లో ఇంత మీనింగ్ ఉందా..

యూత్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొత్త సినిమా కీడా కోలా గురించి అందరికి తెలిసిందే. దాదాపు అందరు కొత్త వాళ్ళను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమా వచ్చే నెల 3న రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలంటే యూత్ లో సపరేట్ క్రేజ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, సినిమాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ విజయం సాధించటమే కాకుండా ప్రేక్షకుల్లో హృదయాల్లో స్థానాన్ని కూడా సంపాదించాయి. అయితే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతుండగానే యాక్టర్ గా కూడా మారడంతో డైరెక్షన్ కొద్దీ రోజులుగా ఆయన దూరమయ్యారు. ఇక ఒక పక్క యాక్టర్ గా ప్రస్తుతం బిజీ గా ఉంటూనే డైరెక్టర్ గా కూడా సినిమా కంప్లిట్ చేసాడు. కీడా కోలా పేరుతో రాబోతున్న తరుణ్ భాస్కర్ కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. ఇంతకు అదేంటంటే..

అయితే కీడా కోలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను యాంకర్ అసలు కీడా కోల పదానికి అర్థం ఏంటని అడగగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. కీడా అంటే హిందీలో పురుగు లేదా బొద్దింక అని అర్థం వస్తుంది. డైనోసార్స్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కీటకాలు, పురుగులు అంతరించి పోయాయి. కానీ బొద్దింక మాత్రం అప్పటి నుంచి, ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వచ్చింది. బొద్దింక లాగానే పరిస్థితులు ఎలా మారిన వాటన్నింటిని దాటుకొని సర్వైవ్ అవ్వాలని ఈ
సినిమాకు కీడా కోల అని పెట్టాం అని తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు