Dharma productions: విజయ్ దేవరకొండ ను వదలని కరణ్ జోహార్- భారీ స్కెచ్ తోనే రంగం లోకి..

ఇటీవలనే రిలీజైన ఖుషి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. ఖుషి సినిమా రిలీజ్ కోసం చాలా రోజుల పాటు వేరే సినిమా షూటింగ్ లేవి మొదలు పెట్టకుండ, కొత్త సినిమాలేవీ కమిట్ అవకుండా ఉన్న విజయ్, ఖుషి సినిమా రిలీజ్ తరువాత నుంచి స్పీడ్ పెంచాడు . ప్రస్తుతం గ్యాప్ లేకుండ షూటింగ్ లలో పాల్గొంటున్న విజయ్ వచ్చే ఏడాది నుంచి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండతో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా కోసం కరణ్ సౌత్ డైరెక్టర్స్ తో టచ్ లోకి కూడా వెళ్తున్నాడట.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఇదివరకే వీరి కాంబినేషన్ లో గతేడాది వచ్చిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండ మార్కెట్ కన్నా ఎక్కువ మొత్తంలో భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఉండటంతో ఖర్చు కు వెనకాడకుండా లైగర్ సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కరణ్ జోహార్ ఈ సారి విజయ్ తో మంచి లవ్ స్టోరీ సినిమాను తీసి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట. లైగర్ విషయంలో చేసిన తప్పును రిపీట్ చేయకుండా పక్క ప్లానింగ్ తోనే విజయ్ దేవరకొండ సినిమాని కరణ్ జోహాన్ పట్టాలెక్కించి ప్రయత్నాలు చేస్తున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు