LCU Movies: లోకేష్ ఓవర్ కాన్ఫిడెంట్… ఇదే తగ్గించుకుంటే మంచిది

ఒక సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ఎలాంటి తప్పు ఉండదు. నిజానికి ఒక సినిమాకు కావాల్సింది హైపే. ఎంత హైప్ ఉంటే.. ఆ సినిమాకు అంత మంచింది. కానీ, దీనితో ఓ ప్రమాదం కూడా ఉంది. ఆ హైప్ ఓవర్ అయితే… వచ్చే రిజల్ట్ దారుణంగా ఉంటుంది. అందుకు బెస్ట్ ఎక్సాంపుల్ లియో.

లియో సినిమా అనౌన్స్ నుంచి మేకర్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. షూటింగ్స్ ఫోటోలను షేర్ చేయడం… కాస్ట్ అండ్ క్రూ విషయంలో అనౌన్స్ మెంట్ తో చేసిన బజ్.. అన్నింటితో లియో సినిమాకి అంచనాలు హై రేంజ్‌కి వెళ్లిపోయాయి. అన్నింటికి కంటే… లియో సినిమా LCUలో భాగం అనే విషయాన్ని రివీల్ చేయకుండా… సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు.

తీరా సినిమా రిలీజ్ అయ్యాకా చూస్తే… ఉన్న హైప్‌కి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కొంత మంది అయితే, లియో సినిమాను డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజేనా? అంటూ ట్రోల్స్ కూడా చేశారు. నిజానికి లోకేష్ డైరెక్షన్ స్కిల్స్ అందరికీ తెలుసు. విక్రమ్, ఖైదీ సినిమాలతో లోకేష్ తన సత్తా ఎంటో చూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలు అదే రేంజ్ లో ఉంటాయని ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ, లియో అలా లేదు. కానీ, గత సినిమాల్లానే హైప్ అయితే ఉంది. దీని వల్లే, లియోకు నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇప్పుడు లోకేష్ కనగరాజ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. ఖైదీ 2పై తాజాగా అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. రజినీకాంత్‌తో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఖైదీ 2 ఉంటుందని, సినిమాలో ఢిల్లీ పాత్ర పాస్ట్ తో పాటు ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది కూడా LCUలో భాగమనే చెబుతూ.. ఖైదీ 2లో చాలా కొత్త అంశాలను రివీల్ చేయబోతున్నట్టు చెప్పాడు. విక్రమ్ లో సంతానం పాత్ర చనిపోతుంది… అంటే డ్రగ్స్ డిస్టబ్యూషన్ ఎవరు చేస్తారు? అనేది కూడా ఖైదీ2లో రివీల్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. అంటే మొత్తంగా… ఖైదీ 2కి ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నాడు లోకేష్.

ముందు చెప్పుకున్నట్టు సినిమాకు హైప్ క్రియేట్ చేయడం తప్పు కాదు.. కానీ, సినిమా దెబ్బ పడితే మాత్రం ముందు పెంచిన హైపే… సినిమాకు శాపంగా మారుతుంది. ఇది ఇప్పటికే లియో సినిమాతో లోకేష్ కి తెలిసింది. అయినా, ఖైదీ 2 విషయంలో మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు? అంటే దీనికి సమాధానం ఉందట. ఖైదీ 2 స్టోరీపైన, తన డైరెక్షన్ పైన కాన్ఫిడెంట్ ఉందట. అందుకే ఇలా హైప్ క్రియేట్ చేస్తున్నాడని లోకేష్ అభిమానుల వాదన. అయితే మరి కొంత మంది.. కాన్ఫిడెంట్ ఉంటే ఏం కాదు… కానీ, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటేనే అసలు సమస్యా అని అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు