Kavya Thapar: స్టోరీ సెలక్షన్ లోపమేనా? ఊరు పేరు భైరవకోన నుంచి కూడా అదే రిజల్ట్ 

ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీలీల జోరు తగ్గింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత బాగా కనిపిస్తోంది. ఇలాంటి సమయాన్ని యంగ్ హీరోయిన్లు ఉపయోగించుకోవాలి. ఆ అవకాశం ప్రస్తుతం కావ్య థాపర్ కు పుష్కలంగా ఉంది. కానీ ఆమె మాత్రం హీరోయిన్ కు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. పేరుకే హీరోయిన్ గానీ, సినిమాల్లో ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండట్లేదు. తాజాగా రిలీజ్ అయిన “ఊరు పేరు భైరవకోన” సినిమాలో కూడా ఇదే పరిస్థితి. మరి ఇదంతా కావ్య స్టోరీ సెలక్షన్ లో లోపమా? అంటే…

ప్రస్తుతం తెరపై ఎక్కువగా కనిపిస్తున్న హీరోయిన్లలో కావ్య థాపర్ ఒకరు. రీసెంట్ గా “ఈగల్” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ, తాజాగా రిలీజ్ అయిన “ఊరు పేరు భైరవకోన” సినిమాలో కూడా నటించింది. 2018లో ఈ “మాయ పేరేమిటో” అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కావ్య “ఏక్ మినీ కథ” సినిమాతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ తరువాత హిందీ, తమిళ భాషల్లో రెండు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు చేసింది. కానీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా “ఈగల్” సినిమాలో రవితేజతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇది స్టార్ హీరో సినిమానే, కానీ కావ్య ఇందులో హీరోయిన్ గా ప్రాధాన్యత లేని పాత్రను పోషించి నిరాశ పరిచింది. “ఈగల్”లో ఆమె కేవలం గెస్ట్ రోల్ లా వచ్చి వెళ్ళిపోతుంది. కనీసం గ్లామర్ పరంగా కూడా స్కోప్ లేని రోల్ చేసింది. సరేలే తరువాత సినిమాతోనైనా తనలోని యాక్టింగ్ టాలెంట్ తో ఫాన్స్ ను మెస్మరైజ్ చేస్తుందేమో అనుకుంటే, మళ్లీ అదే సీన్ రిపీట్ చేసి గట్టి షాకే ఇచ్చింది.

సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ “ఊరు పేరు భైరవకోన”. చేతబడుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి రాగా, ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా కావ్య పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కనీసం సెకండ్ హీరోయిన్ అని చెప్పుకోవడం కూడా వృధానే. ఆ స్థానంలో ఓ లేడీ కమెడియన్ ని పెట్టినా వర్కౌట్ అయ్యేది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

తండ్రి, కూతురు డ్రామా సీన్ లో కాస్త పర్వాలేదు అనిపించినా ఓ హీరోయిన్ చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఈమె కన్నా లేడీ కమెడియన్ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శరణ్య ప్రదీప్ లాంటి నటీమణులు తమ టాలెంట్ ను నిరూపించుకునే సత్తా ఉన్న పాత్రలు చేస్తూ పాపులర్ అవుతుంటే, హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్న ఈ బ్యూటీ మాత్రం వచ్చిన ఆఫర్లన్నీ ఇలా వేస్ట్ చేసుకుంటుంది. మరి ఇప్పటికైనా కావ్య తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న క్యారెక్టర్లు, మంచి కంటెంట్ ఉన్న కథలను ఆచితూచి ఎంచుకుంటే బెటర్. లేదంటే త్వరలోనే ఈ బ్యూటీ అవకాశాలు కరువై కనిపించకుండా పోయిన హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయే అవకాశం ఉంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు