Kavya Thapar: ఈ హీరోయిన్ కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తోందా?

Kavya Thapar

హీరోయిన్ కావ్య థాపర్ కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తుందా? కంటెంట్ తో అసలు ఆమెకు సంబంధం లేదా? ఆమె చేస్తున్న సినిమాలు చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరి. తాజాగా రిలీజ్ అయిన “ఈగల్” సినిమాలో అసలు ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించి ఇలాంటి కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది కావ్య. చేసేది కొన్ని సినిమాలు అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేస్తే బెటర్. కానీ ఈ బ్యూటీ మాత్రం ప్రతి సినిమాలోనూ దాదాపుగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్లు చేస్తూ టాలీవుడ్ లో హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఉంది అన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తోంది.

2018లో ఈ “మాయ పేరేమిటో” అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కావ్య “ఏక్ మినీ కథ” సినిమాతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. కరోనా టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలా కరోనా టైం కాస్తా కలిసి రావడంతో హీరోయిన్ కావ్య థాపర్ అందరికీ పరిచయమైంది. ఇక ఆ తర్వాత మంచి ఆఫర్లు కొట్టేస్తుందని అనుకుంటే పెద్దగా సినిమాల్లో కనిపించలేదు ఈ అమ్మడు.

అయితే అంతలోపు హిందీలో ఒక సినిమా, తమిళ భాషలోనూ రెండు మూడు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు చేసింది. కానీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే ఇండస్ట్రీలోకి కావ్య అడుగుపెట్టి దాదాపు ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ ఆమెకు స్టార్ స్టేటస్ రాకపోవడానికి కారణం ఈ బ్యూటీ ఎంచుకున్న పాత్రలే. ఇప్పటిదాకా టాలీవుడ్ లో కావ్య హీరోయిన్ గా చేసిన 3 సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా అంటే “ఏక్ మినీ కథ” మాత్రమే.

- Advertisement -

తాజాగా “ఈగల్” సినిమాలో రవితేజతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అయితే రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కడం అనేది విశేషమే. కానీ ప్రాధాన్యత లేని పాత్రను స్టార్ హీరో సినిమాలో చేసినప్పటికీ ఉపయోగం ఏంటి? ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన “ఈగల్” సినిమాను చూస్తే అసలు ఈ సినిమాకు కావ్య ఎందుకు సైన్ చేసిందో కనీసం ఆమెకన్నా అర్థమైందా అంటే అనుమానమే.

“ఈగల్” సినిమాలో పేరుకే హీరోయిన్ కావ్య థాపర్. కానీ ఆమె కేవలం గెస్ట్ రోల్ లా వచ్చి వెళ్ళిపోతుంది. కనీసం గ్లామర్ పరంగా కూడా స్కోప్ లేని రోల్ కావ్య చేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమాలో హీరోయిన్లు ఉన్నారన్న విషయం కూడా ఎవరికీ గుర్తు ఉండదు. మరి ఇలాంటి అనవసరమైన సినిమాలు ఒప్పుకోవడం వల్ల వాళ్ల కెరీర్ కు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ తర్వాత వచ్చే అవకాశాలన్నీ కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉంది.

చేసేది తక్కువ సినిమాలైనా తమ టాలెంట్ ను నిరూపించుకునే సత్తా ఉన్న పాత్రలు ఎంచుకుంటే సినిమా చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతారు స్టార్స్. మరి ఈ సత్యం అర్థం కావడానికి కావ్యకు ఇంకెన్ని ఏళ్లు పడుతుందో చూడాలి. “ఈగల్”లో ఎలాగూ నిరాశపరిచింది. ఫిబ్రవరి 16న ఈమె నటించిన “ఊరు పేరు భైరవకోన” మూవీ రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాలోనైనా కావ్య థాపర్ మంచి పాత్రతో ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు