Eagle : తెలుగు డైరెక్టర్స్ కి ఇదేం రోగం… కేజీఎఫ్ మాయలో నుంచి ఇక బయటకురాలేరా?

Eagle

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు రూపొందించే సినిమాల ఎఫెక్ట్ ఎప్పటికీ తగ్గదు. ఆ సినిమాల తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మేనియా మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోతుంది. అలా ఉండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక చాలామంది దర్శకులు అదే మూవీని స్ఫూర్తిగా తీసుకొని తమ సినిమాలను తెరకెక్కించే రేంజ్ లో ప్రభావం చూపించింది కేజిఎఫ్. అయితే ఈ మూవీ రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆ మాయలో నుంచి టాలీవుడ్ డైరెక్టర్స్ బయటపడలేకపోతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు కేజిఎఫ్ బాటలో నడవగా తాజాగా రిలీజ్ అయిన “ఈగల్” కూడా ఈ లిస్టులో చేరిపోయింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ ఫిలిం మేకర్స్ పై కేజిఎఫ్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది అనే విషయం ప్రతి సినిమాతో ప్రూవ్ అవుతూనే ఉంది. కేజిఎఫ్ తర్వాత ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రకంగా “కేజీఎఫ్”లోని ఏదో ఒక అంశం కనిపిస్తూనే ఉంది. ఇక మెషీన్ గన్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “కేజీఎఫ్” పరిచయం చేసిన ఈ గన్ ను రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ మార్క్ ఆంటోనీ, యానిమల్, సలార్ సినిమాల్లో కూడా ఫాలో అయ్యారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎన్టీఆర్, కొరటాల “దేవర”, నాగ చైతన్య, చందూ మొండేటి “తండేల్” సినిమాలు ఫాలో అవుతున్న డార్క్ బ్యాక్ డ్రాప్ కూడా “కేజీఎఫ్”తో పరిచయం అయ్యిందే. మరి పెద్ద డైరెక్టర్ల పైనే ఈ రేంజ్ లో “కేజీఎఫ్” ఎఫెక్ట్ ఉంటే, చిన్న డైరెక్టర్స్ పై ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా రిలీజైన “ఈగల్” సినిమాలో కూడా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని “కేజిఎఫ్”నే ఫాలో అయ్యాడు. చాలావరకు సినిమాపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మరి దర్శకులు కేజీఎఫ్ మాయలో నుంచి ఎప్పుడు బయటపడతారో !

“ఈగల్” మూవీలో కొన్ని మినహా పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏమీ కనిపించవు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉండగా, సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది. మొత్తంగా ఎలాంటి ఆసక్తిని కలిగించని, ఆకట్టుకోలేని బోరింగ్ యాక్షన్ సినిమాగా “ఈగల్”ను మలిచాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. టెక్నికల్ గా ఈ మూవీ బాగున్నా ఆసక్తికరమైన కథ, కథనాలు లేకపోవడం వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష అవుతుంది. ఇక డిఓపి గా ఈ డైరెక్టర్ కు మంచి మార్కులు వేయాల్సిందే. కానీ దర్శకుడిగా ఈయన కంటే సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్లే బెటర్ అనిపిస్తుంది. స్టోరీ కంటే ఎక్కువగా ఈ యాక్షన్ సన్నివేశాలపై మాత్రమే దృష్టి పెట్టాడు కార్తీక్. కార్తీక్ మొదటి సినిమా “సూర్య వర్సెస్ సూర్య”. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత దాదాపు తొమ్మిదేళ్లపాటు అతనికి దర్శకత్వం వహించే ఛాన్స్ రాలేదు అంటేనే ఆయన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రెండవ సినిమా “ఈగల్” కూడా అంత ఆకట్టుకోలేదు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు