Yatra2 Collections: కార్యకర్తల ప్రభావంతో కొంచెం పనైంది..

Yatra2 Collections

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో యాత్ర 2 కూడా ఒకటి. దివంగత సీఎం వైయస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర తెరకెక్కగా, దానికి సీక్వెల్ గా వైయస్ జగన్ ని కూడా లింక్ చేస్తూ యాత్ర 2 ను తెరకెక్కించారు. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మమ్ముట్టి వై యస్ రాజశేఖర్ రెడ్డి గా నటించగా, జీవా జగన్మోహన్ రెడ్డిగా నటించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓపెనింగ్స్ పరంగా నిరుత్సాహపరిచిందని చెప్పాలి.

కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాకు ఒక వర్గం నుండే సినిమా చూడ్డానికి ఆడియన్స్ రావడం జరిగింది. పైగా కరెక్ట్ గా ఎలక్షన్ టైం లో రిలీజ్ చేయడం వల్ల కొంత నెగిటివిటి కూడా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం లో మాత్రం పూర్ ఓపెనింగ్స్ దక్కగా, వైయస్ అభిమానులు ఉన్న సీడెడ్ వంటి ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఆంధ్ర లోని చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు దగ్గరుండి సినిమాని ప్రమోట్ చేయడం వల్ల కొన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల షేర్ ని, వరల్డ్ వైడ్ గా 1.65 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా 3.30 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ దక్కించుకుంది.

అయితే 2019 లో వచ్చిన యాత్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.22 కోట్ల షేర్ ఓపెనింగ్ దక్కించుకోగా, సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కు దానికంటే తక్కువ ఓపెనింగ్స్ రావడం గమనార్హం. పైగా ఉన్నవి లేనివి కొంచెం కల్పించి చెప్పడం వల్ల డ్రామా అతి అయ్యిందనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు అటు ఇటుగా బిజినెస్ జరగగా, ఈగల్ మూవీ రిలీజ్ వల్ల రెండో రోజు కలెక్షన్లలో యాత్ర 2 కి బ్రేక్ పడొచ్చు. మరి వీకెండ్లో యాత్ర2 ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు