Valentines Day : యాంటీ వాలెంటైన్స్ డే కూడా ఉంటుందని తెలుసా?

Valentines Day

వాలెంటైన్స్ డే అనేది ప్రేమికులకు ఎంత ప్రత్యేకమైన రోజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 14 వరకు రోజుకో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజు రోజ్ డే, రెండవ రోజు ప్రపోజ్ డే, మూడవ రోజు చాక్లెట్ డే, నాలుగవ రోజు టెడ్డి డే, ఐదవ రోజు ప్రామిస్ డే, ఆరవ రోజు హగ్ డే, ఏడవ రోజు కిస్ డే అంటూ వారం రోజులపాటు వాలెంటైన్స్ వీక్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు లవర్స్. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. మరి యాంటీ వాలెంటైన్స్ డే అంటే ఏంటి? అసలు ఆ రోజు ఏం చేస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు.

వాలెంటైన్స్ డే అయిపోగానే యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. వాలెంటైన్స్ వీక్ సెలబ్రేషన్స్ కు ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో విధంగా గడుపుతారు. ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ లో స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే వంటివి ఉంటాయి. అయితే యాంటీ వాలెంటైన్స్ వీక్ అనేది ప్రేమికులకు వ్యతిరేకం కాదు. కానీ వాలెంటైన్స్ డే వేడుకల అనంతరం అసంతృప్తిగా భావించే సింగిల్స్ ను ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ అనేది తమ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉన్న ఒక్కో రోజుకు ఒక్కో అర్థం ఉంటుంది. మరి అర్థాలు ఏంటి అంటే…

ఫిబ్రవరి 15న స్లాబ్ డే స్టార్ట్ అవుతుంది. ఆ రోజున బాధ పెట్టే వారిని జీవితంలో నుంచి బయటకు గెంటేస్తారు. చెంప దెబ్బ కొట్టినట్టుగా మాట్లాడే వారు, చెడు లేదా హింసించే వారిని ఎదుర్కొని, వారితో ధైర్యంగా సంబంధాలను పెంచుకుంటారు.

- Advertisement -

ఫిబ్రవరి 16న కిక్ డే రోజు కోపాన్ని విడిచిపెడతారు.

ఫిబ్రవరి 17న పెర్ఫ్యూమ్ డే రోజున కొత్త సువాసనతో రిలేషన్షిప్ స్టేటస్ తో సంబంధం లేకుండా స్పెషల్ గా సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి అర్హులమని గుర్తించాలని అర్థం.

ఫిబ్రవరి 18న ఫ్లర్ట్ డే రోజు రొటీన్ సోషల్ ఇంటరాక్షన్ తో పాటు కాస్త మసాలా యాడ్ చేస్తారు.

ఫిబ్రవరి 19న కన్ఫెక్షన్ డే… ఫీలింగ్స్ విషయంలో ఓపెన్ గా ఉండేలా, బలహీనతల గురించి ధైర్యంగా బయట పెట్టి, తప్పులను ఒప్పుకునే విధంగా ప్రోత్సహిస్తుంది.

ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే ఎవరినైనా మిస్ అయ్యాం అన్న ఫీలింగ్ అందరికీ సాధారణమే అని అంగీకరించి ప్రశాంతంగా ఉండాలని సూచిస్తుంది.

ఫిబ్రవరి 21న యాంటీ వాలెంటైన్స్ వీక్ ముగుస్తుంది. ఇదే బ్రేకప్ డే కాగా.. సెల్ఫ్ లవ్, ఆశను పెంచుకోవాలని, భవిష్యత్తు విలువను అర్థం చేసుకోమని సూచిస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు