The Kerala Story on OTT : ఓటిటిలో వచ్చేసిన వివాదాస్పద సినిమా “ది కేరళ స్టోరీ” 

బ్యూటిఫుల్ హీరోయిన్ ఆదా శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు తెలుగులో నటించలేదు. కానీ హిందీలో మాత్రం బిజీగా ఉంది. గతేడాది ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన కాంట్రవర్సీ మూవీ “ది కేరళ స్టోరీ” ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ తీవ్ర సంచలనం రేపింది. గత సంవత్సరం మే 5న రిలీజ్ అయిన “ది కేరళ స్టోరీ” మూవీ 15 నుంచి 20 కోట్ల బడ్జెట్ తో రూపొందగా, బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ సాధించి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఎన్నో వివాదాలకు, విమర్శలకు దారి తీసిన ఈ మూవీ హిందీలో మాత్రమే రిలీజ్ కాగా, ఇతర భాషా ప్రేక్షకులు కూడా దీన్ని థియేటర్లలో చూడడానికి ఆసక్తిని కనబరిచారు. అలాగే ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ పలు అడ్డంకుల కారణంగా “ది కేరళ స్టోరీ” మూవీ ఓటిటి రిలీజ్ ఇప్పటిదాకా వాయిదా పడుతూనే వచ్చింది. పలుమార్లు ఈ మూవీ ఓటిటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించినప్పటికీ, తీరా ఆ టైం రాగానే వాయిదా పడి ఆడియన్స్ ను నిరాశకు గురి చేసేది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు సుమారు 9 నెలల తర్వాత “ది కేరళ స్టోరీ” మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. నిజానికి ఈ వివాదాస్పద మూవీని కొనడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు. కానీ జీ5 మాత్రం “ది కేరళ స్టోరీ” మూవీని మంచి ధరకు కొని సాహసమే చేసింది. ఫిబ్రవరి 16 నుంచి జీ 5లో “ది కేరళ స్టోరీ” స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో “ది కేరళ స్టోరీ” ఓటిటిలో ప్రసారం అవుతోంది. థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులు, కేవలం హిందీ భాషలోనే రూపొందిన ఈ మూవీని భాషరాక చూడలేకపోయిన మూవీ లవర్స్ ఇప్పుడు జీ5లో తమకు నచ్చిన భాషలో “ది కేరళ స్టోరీ” మూవీని హ్యాపీగా చూసేయొచ్చు.

ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన “ది కేరళ స్టోరీ” మూవీకి సుదీప్టో సేన్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. యోగితా బలానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ కీలక పాత్రలు పోషించారు. 2023 మే 5న “ది కేరళ స్టోరీ” మూవీ దాదాపు 2000 స్క్రీన్ లలో భారీ ఎత్తున రిలీజ్ కాగా, 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు