Sai dharam tej: అవార్డులతో తడిసి ముద్దవుతున్న సత్య..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకుని కం బ్యాక్ అయ్యారు.. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా గాంజా శంకర్ ప్రకటించారు కానీ ప్రస్తుతం ఆగిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టుని పెద్ద బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గతేడాది సాయిధరమ్ తేజ్, కలర్స్ ఫేమ్ స్వాతి రెడ్డి నటించిన షార్ట్ ఫిలిం సత్య.. ఇప్పుడు వరుసగా ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంటూ అంతకంతా స్థాయిని పెంచుకుంటూ పోతోంది. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ లో ఏకంగా ఎనిమిది పురస్కారాలను అందుకుంది ఈ చిత్రం . ఉత్తమ నటుడు, ఉత్తమ నటి , ఉత్తమ శబ్ద గ్రహణం, ఉత్తమ సినిమాటోగ్రఫీ , ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నిర్మాత , షార్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇలా అన్ని కేటగిరీల్లో కూడా విజేతగా నిలిచింది.. ఇక ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీకే నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు..

మొత్తానికి సత్య వెబ్ సిరీస్ ప్రస్తుతం వరుస అవార్డులతో తడిసి ముద్దవుతున్న వేళ అటు నవీన్ విజయ్ కృష్ణ కి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఆ మధ్య మంత్ ఆఫ్ మధు తో మరో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన కలర్స్ స్వాతి దానితో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.. కానీ ఇప్పుడు సత్య షార్ట్ ఫిలిం కి వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఫీల్ అవుతోంది ..మరొకవైపు సత్య షార్ట్ ఫిలిం కి న్యూయార్క్ లో కూడా రెండు ఓనీరోస్ అవార్డులు లభించాయి. ఇకపోతే ఆగస్టులో విడుదల చేసిన లిరికల్ వీడియో తప్ప ఇంకా ఫుల్ మూవీ ని చిత్ర బృందం రిలీజ్ చేయలేదు. త్వరలో ఫ్లాట్ఫారం డిసైడ్ చేసి ప్రకటిస్తారట.

- Advertisement -

మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషన్స్ తో రూపొందిన సత్యకు ఇంత మంచి గుర్తింపు లభించింది అంటే కంటెంట్ బలంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే సాయి ధరంతేజ్ ఈ షార్ట్ ఫిలిం తో భారీ సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. వాస్తవానికి ఈయన గతంలో కూడా సామాజిక స్పృహ కలిగించే వీడియో ఫిలిమ్స్ లో నటించాడు . డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం వైవా హర్ష తో కలిసి చేసిన ఒకసారి బాగా పేరు దక్కించుకుంది మొత్తానికైతే సినిమాలతోనే కాదు ఇటు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్.. మిగతా హీరోలు కూడా ఇలా సరికొత్తగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అనడంలో సందేహం లేదు..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు