Mamitha Baiju: అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్ళి దూరం నుంచి చూసా

ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కి మంచి స్టార్ డంను తీసుకొచ్చి పెట్టింది. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ స్థాయి వేరే లెవెల్ కి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. అంతటి బెస్ట్ పర్ఫామెన్స్ ను ఆర్య సినిమాలో ఇచ్చాడు అల్లు అర్జున్.

ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ కి సుకుమార్ కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అల్లు అర్జున్ తన కెరియర్ లో ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా సుకుమార్ తో అల్లు అర్జున్ కి ఉన్న బాండింగ్ వేరు. లాస్ట్ టైం పుష్ప సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ఒక విషయం చెబుతూ వచ్చాడు. తనకు ఇష్టమైన ఒక మంచి కారును కొనుక్కున్న టైంలో స్టీరింగ్ పైన చెయ్యేసి ఇక్కడ వరకు రావడానికి ఎవరు కారణం అని ఆలోచిస్తే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చిన పేరు సుకుమార్ అని చెప్తూ, సుకుమార్ ఉద్దేశిస్తూ డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను అంటూ చెప్పాడు.

వీరిద్దరి మధ్య బాండింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మాత్రం అల్లు అర్జున్ ని వేరే లెవెల్ లో నిల్చోబెట్టింది. తగ్గేదేలే అని పుష్ప సినిమా డైలాగులా అల్లు అర్జున్ కూడా ఎక్కడా తగ్గకుండా మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చి తనదైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు.

- Advertisement -

ఇకపోతే పుష్ప సినిమా ముందు నుంచే కూడా అల్లు అర్జున్ కి మలయాళం లో మంచి మార్కెట్ ఉందనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ని అక్కడ మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆ రేంజ్ ఫ్యాన్స్ ని సాధించాడు అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా హిట్ అయిన ప్రేమలు సినిమా హీరోయిన్ మమిత అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాన్ అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే అల్లు అర్జున్ నటించిన హ్యాపీ, ఆర్య వంటి సినిమాలను వాళ్ళు అప్పట్లోనే చూసి అల్లు అర్జున్ ని ఇష్టపడ్డాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ప్రేమలు సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఆ టైంలోనే హీరోయిన్ అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్లి చాలా దూరం నుంచి చూసి వచ్చేసింది అంట. ఇకపోతే అల్లు అర్జున్ ని కలవడం తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చింది మమిత.

ఏదేమైనా అల్లు అర్జున్ జర్నీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మర్ అని, అల్లు అర్జున్ చూసి నేర్చుకోవాల్సింది ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ లో జగపతిబాబు కూడా మాట్లాడుతూ “అల్లు అర్జున్” నాన్ స్టాప్ గా జిమ్లో వర్కౌట్ చేస్తూ కనిపించాడు. ఆ రోజే ఇతను పెద్ద స్టార్ అవుతాడని తను ఊహించానని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు