Pushpa 2 : జపాన్ లో “పుష్ప 2″… రిలీజ్ డేట్ లీక్ చేసిన రష్మిక

ఒకప్పుడు టాలీవుడ్ వేరు ఇప్పుడు వేరు. తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ రేంజ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో “పుష్ప 2” కూడా ఒకటి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన “పుష్ప”కు ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్. అందుకే సీక్వెల్ ను ఇతర దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జపాన్ లో “పుష్ప 2” రిలీజ్ ఎప్పుడు అంటే…
“పుష్ప” రాజ్ కు దేశవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్యారెక్టర్ మేనరిజం, డైలాగులు, పాటలు క్రేజీ అనిపించేలా చేశాయి. ముఖ్యంగా జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా “పుష్ప”కు మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ కోసం మనతో పాటే వాళ్ళు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ముందుగా ఇండియాలో “పుష్ప” మూవీని రిలీజ్ చేసి, ఆ తర్వాత విదేశాల్లో విడుదల చేశారు. కానీ ఇప్పుడు సీక్వెల్ విషయంలో మాత్రం మేకర్స్ ప్లానింగ్ డిఫరెంట్ గా ఉంది. భారత్ లో “పుష్ప 2″ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అప్పుడే జపాన్ లో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ రష్మిక మందన్న లీక్ చేసింది. జపాన్ లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలు పెట్టింది. “పుష్ప 3” ఒరిజినల్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందే అదే రోజు జపాన్ లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ 2024 ఆగస్టు 15న “పుష్ప 2” జపనీస్ ముందుకు రాబోతుందన్న గుడ్ న్యూస్ ను వెల్లడించింది. ఈ అప్డేట్ విన్న తర్వాత జపాన్ ఫాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది.

శ్రీవల్లికి జపనీస్ గ్రాండ్ వెల్కమ్
“పుష్ప” మూవీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు గ్లోబల్ లెవెల్ లో మంచి గుర్తింపు దక్కింది. అలాగే శ్రీవల్లిగా నటించిన రష్మికకు కూడా మంచి పాపులారిటీ పెరిగింది. తాజాగా ఈ బ్యూటీ టోక్యోలో జరిగిన క్రంచిరోల్ యానిమి అవార్డ్స్ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. ఈ సందర్భంగానే ఆమె మీడియాతో మాట్లాడుతూ జపాన్లో “పుష్ప 2” రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఇక అవార్డ్స్ వేడుకకు జపాన్ వెళ్లిన రష్మికకు జపనీస్ నుంచి అదిరిపోయే వెల్కమ్ లభించింది.

- Advertisement -

ఇక ఇటీవల అల్లు అర్జున్ కూడా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో “పుష్ప” స్క్రీనింగ్ కు హాజరైన విషయం తెలిసిందే. కాగా ఇప్పటిదాకా కేవలం సీక్వెల్ “పుష్ప 2” నుంచి ఒక పోస్టర్, గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఎన్నోసార్లు ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో “పుష్ప 2” పోస్ట్ పోన్ అవుతుందని రూమర్లు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ తాజాగా రష్మిక చేసిన అనౌన్స్మెంట్ తో “పుష్ప 2″ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చినట్టుగా అయ్యింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు