Vishwambhara : ఐదుగురు సిస్టర్లతో చిరు… “హిట్లర్” వైబ్స్ షురూ

గత చిత్రం “భోళా శంకర్”తో అభిమానులను నిరాశపరిచిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” అనే సోషియో ఫాంటసీ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు వేరే లెవెల్ అన్నట్టుగా ఉన్నాయి. అయితే ఇందులో నటించబోయే హీరోయిన్ల గురించి రోజుకో వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ ఐదుగురు సిస్టర్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ చిరుకు సిస్టర్స్ గా కనిపించబోయే ఐదుగురు హీరోయిన్లు ఎవరు? అంటే…

చిరు సిస్టర్స్ వీళ్లే..
“విశ్వంభర” మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే. మేకర్స్ అఫీషియల్ గా త్రిషను సెట్స్ లోకి ఆహ్వానించి, ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇక ఆ తర్వాత ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. వాళ్లంతా ఏంజిల్స్ గా కనబడబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి “విశ్వంభర”లో చిరు సిస్టర్స్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటే స్పెషల్ రోల్స్ లో మరో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

స్పెషల్ రోల్స్ లో హాట్ బ్యూటీలు…
“విశ్వంభర” మూవీలో త్రిషతో పాటు నలుగురు హీరోయిన్లు నటిస్తుండగా, మరో ఇద్దరు హీరోయిన్లు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు గా ఉన్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, సౌత్ హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ మూవీలో గెస్ట్ రోల్స్ లు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజ్ తరుణ్, నవీన్ చంద్ర వంటి యంగ్ హీరోలు కీలక పాత్రలు పోషించబోతున్నారని సమాచారం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో ఇంత మంది హీరోయిన్లు నటిస్తున్నారు అని వార్తలు రావడంతో “హిట్లర్” వైబ్స్ షురూ అయ్యాయి.

- Advertisement -

“హిట్లర్” వైబ్స్…
అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి “హిట్లర్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉంటారన్న విషయం టాలీవుడ్ ఆడియన్స్ కి గుర్తుండే ఉంటుంది. 1996 జనవరి 4న రిలీజ్ అయిన “హిట్లర్” మూవీకి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా “విశ్వంభర” మూవీలో కూడా ఇదే తీరున చిరుకు ఏకంగా ఐదుగురు అక్క చెల్లెలు ఉంటారని వస్తున్న వార్తలు చూసి, సోషియో ఫాంటసీ మూవీ అనే పేరుతో హిట్లర్ 2ను తీస్తున్నారా ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ వార్తలతో మరోసారి “హిట్లర్” వైబ్స్ తెరపైకి వచ్చాయని అంటున్నారు.

విశ్వంబర కథ విషయానికి వస్తే…
భీమవరం దగ్గర్లోని ఓ గ్రామంలో “విశ్వంభర” స్టోరీ స్టార్ట్ అవుతుందని, పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిగా చిరు కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఐదుగురు అక్కచెల్లెళ్ల బాధ్యత చిరు మీదే ఉంటుందని, వాళ్ల కోసం ఎంతటి కష్టమైనా, సాహసమైనా చేయడానికి సిద్ధపడే అన్నయ్యగా చిరు కనిపించబోతున్నాడని అంటున్నారు. దీంతో ఫాంటసీ సంగతి ఏమోగానీ ఇలాగైతే సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక గతంలో చిరంజీవి నటించిన ఫాంటసీ బ్యాక్ డ్రాప్ మూవీస్ జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాలను మించి “విశ్వంభర” ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించి హైప్ పెంచేసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు