Box office : ఈ వారం రిలీజైన సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

ఒకప్పుడు వేసవి సెలవులంటే థియేటర్ లో సినిమాల సందడి ఉండేది. ఫ్యామిలీ అంత థియేటర్ కి వెళ్లి సినిమా చూసి హ్యాపీ గా ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే  ప్రస్తుతం  మారిన పరిస్థితులు, మనుషుల్లో ఆలోచన విధానాలు అలాగే టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల థియేటర్ లలో సినిమా చూసే అలవాటు గతంతో పోల్చితే కాస్తా తగ్గిందనే చెప్పాలి.

ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే తప్ప జనాలు థియేటర్ మొహం చూడట్లేదు. దానికి తోడు ఓటీటీలు ప్లాట్ ఫామ్ లు ఎక్కువై, అందరు ఇంట్లోనే కూర్చొని సినిమా చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే ఈ వారం 6 సినిమాలు రిలీజై, థియేటర్ లలో సందడి చేసాయి. అయితే అందులో 4 సినిమాలు మీడియం మరియు low బడ్జెట్ సినిమాలు కాగా ఒకటి మలయాళం లో సూపర్ హిట్టైన సినిమా (2018 ). మరొకటి నరేష్, పవిత్ర ల ప్రేమ కథ చిత్రమైన ” మళ్ళీ పెళ్లి “

- Advertisement -

అయితే ఈ సినిమాలన్నిటిలో కలెక్షన్స్ పరంగా చూస్తే స్వల్ప తేడాతో 2018 సినిమా టాప్ లో ఉంది. కేరళలో 2018 లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో టొవినో థామస్, లాల్ నారైన్, అపర్ణా బాల మురళి, కళైరాసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు నటించారు. జ్యూడ్ అంథోని జోసెఫ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు

అలాగే యూట్యూబ్ నిర్మాణ సంస్థగా పాపులర్ అయిన ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ నుంచి మేం ఫేమస్ సినిమా కలెక్షన్స్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ ప్రముఖ తారాగణంగా నటించారు. ఛాయ్ బిస్కెట్ మరియు లహరి ఫిలిమ్స్ బ్యానర్ పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ సినిమాని నిర్మించారు.

ఇక కలెక్షన్స్ పరంగా మూడవ ప్లేస్ లో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఉంది. ప్రముఖ ప్రొడ్యూసర్ యంయస్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా. యాక్టర్ నరేషే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

పై మూడు సినిమాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

2018 – 1.01cr
మేం ఫేమస్ – 1.1cr
మళ్ళీ పెళ్ళి – 40L

అయితే ఈ సినిమాలతో పాటు మగవాళ్ల కష్టాలను ఆధారంగా చేసుకొని మెన్ టూ ( men too) అనే సినిమా రిలీజైయింది. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీకాంత్ జీ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అలాగే ” జైత్ర” అనే మరో చిన్న సినిమా థియేటర్స్ లో రిలీజైయింది. సన్నీ నవీన్, రోహిణి, రాచెల్ హీరోయిన్లుగా నటించారు.మల్లికార్జున్ తోట ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాతో పాటు గ్రే అనే మరో సినిమా కూడా రిలీజయ్యింది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇట్స్ మై లవ్ స్టోరీ ఫేం అరవింద్ కృష్ణ హీరోగా నటించగ, ఊర్వశి రాయ్ బిగ్ బాస్ ఫేం అలీ ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ మాదిరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఓవరాల్ గా చూసుకుంటే మేం ఫేమస్ మరియు 2018 ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల దగ్గరనుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. మళ్ళీ పెళ్ళి సినిమాకి మాత్రం ప్రేక్షకుల దగ్గరనుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. మరీ ఈ సినిమాలలో ఏ సినిమా ఈ వేసవికి సూపర్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు